Compost | కిచెన్ గార్డెన్ కోసం మీరే సొంతంగా కంపోస్ట్ ఎరువును ఇలా తయారు చేసుకోండి..
Compost Making At Home : మనం ఒక రోజులో ఎంత గృహ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నామో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చింతన్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ అండ్ యాక్షన్ గ్రూప్ నివేదిక ప్రకారం.. పెద్ద నగరాల్లోని మధ్యతరగతి కుటుంబాలు రోజుకు దాదాపు 0.8 కిలోల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నారు. గృహాలలో నుంచి వచ్చే వ్యర్థాల్లో దాదాపు 60% లేదా అంతకంటే ఎక్కువ భాగం సేంద్రీయ పదార్థమే ఉంటుంది. మీ వంటగది వ్యర్థాలను అనవసరమని చెత్తకుప్పలో పడేయకుండా దానిని కంపోస్ట్ ఎరువుగా మార్చుకోవడం అత్యుత్తమమైన మార్గం.అపార్ట్‌మెంట్లలో ఉన్నవారుకూడా ఈజీగా కంపోస్ట్ ను తయారు చేసుకొని టెర్రస్ గార్డెన్ కోసం చక్కగా వినియగించుకోవచ్చు. మీరు మీ రోజువారీ డస్ట్‌బిన్ కంటెంట్‌లను గొప్ప సేంద్రీయ ఎరువుగా మార్చవచ్చు. దానితో పూలమొక్కలు, కూరగాయల మొక్కలను పెంచుకోవచ్చు.సేంద్రీయ వ్యవసాయంలో కంపోస్ట్ చాలా ముఖ్యమైనది. కంపోస్ట్ ఎరువు మొక్కలకు అనేక రక...