
KVK Ghantasala | ఆలస్యంగా వేసిన మినుము పంటకు బూడిద తెగులు ప్రమాదం – నివారణ చర్యలు తప్పనిసరి: డాక్టర్ డి. సుధారాణి
KVK Ghantasala : ఆలస్యంగా మినుము పంట వేసిన పొలాల్లో బూడిద తెగులు (Powdery Mildew) ఆశించి నష్టపరుస్తుందని రైతులు వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని కేవీకే సమన్వయకర్త డాక్టర్ డి.సుధారాణి సూచించారు. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం కృష్ణా జిల్లాలోని 7 వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలోని ఘంటసాల మండలంలోని ఘంటసాల, ఘంటసాలపాలెం, తాడేపల్లి, దేవరకోట, లంకపల్లి గ్రామాలతో పాటు పమిడిముక్కల, పామర్రు, తోట్లవల్లూరు, గన్నవరం, పెడన, ఉయ్యూరు, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, బంటుమిల్లి, గుడివాడ మండలాల్లోని మినుము పంటను క్షేత్రస్థాయిలో సందర్శనలు చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ ఆలస్యంగా మినుము పంటలు వేసుకున్న పొలాల్లో పొగమంచు నేపథ్యంలో బూడిద తెగులు ఆశించి నష్టాన్ని కలుగజేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.కావున బూడిద తెగులు నివారణకు మైక్లోబ్యుటానిల్ 1.0 గ్రా. లేదా డైఫెన్ కొనజోల్ 1.0...

