Harithamithra Telugu News

Home Agricultue వ్యవసాయ వార్తలు KVK Ghantasala | ఆలస్యంగా వేసిన మినుము పంటకు బూడిద తెగులు ప్రమాదం – నివారణ...

KVK Ghantasala | ఆలస్యంగా వేసిన మినుము పంటకు బూడిద తెగులు ప్రమాదం – నివారణ చర్యలు తప్పనిసరి: డాక్టర్ డి. సుధారాణి

0
KVK Ghantasala

KVK Ghantasala : ఆలస్యంగా మినుము పంట వేసిన పొలాల్లో బూడిద తెగులు (Powdery Mildew) ఆశించి నష్టపరుస్తుందని రైతులు వెంట‌నే నివారణ చర్యలు తీసుకోవాలని కేవీకే సమన్వయకర్త డాక్టర్ డి.సుధారాణి సూచించారు. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం కృష్ణా జిల్లాలోని 7 వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలోని ఘంటసాల మండలంలోని ఘంటసాల, ఘంటసాలపాలెం, తాడేపల్లి, దేవరకోట, లంకపల్లి గ్రామాలతో పాటు పమిడిముక్కల, పామర్రు, తోట్లవల్లూరు, గన్నవరం, పెడన, ఉయ్యూరు, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, బంటుమిల్లి, గుడివాడ మండలాల్లోని మినుము పంటను క్షేత్రస్థాయిలో సందర్శనలు చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ ఆలస్యంగా మినుము పంటలు వేసుకున్న పొలాల్లో పొగమంచు నేపథ్యంలో బూడిద తెగులు ఆశించి నష్టాన్ని కలుగజేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.

కావున బూడిద తెగులు నివారణకు మైక్లోబ్యుటానిల్ 1.0 గ్రా. లేదా డైఫెన్ కొనజోల్ 1.0మి.లీ లేదా హెక్సాకోనాజోల్ 2.0మి.లీ లేదా ప్రోపికోనాజోల్ 1.0 మి.లీ చొప్పున లీటరు నీటికి కలిపి 10-15 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి మందులను మార్చి మార్చి పిచికారి చేసుకోవాలని రైతులకు సూచించారు.

నివారణకు తీసుకోవాల్సిన చర్యలు :

రైతులు ఈ క్రింది శిలీంధ్రనాశకాలను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని సూచించారు:

  • మైక్లోబ్యూటానిల్ – 1.0 గ్రాము
    లేదా
  • డైఫెన్‌కోనాజోల్ – 1.0 మి.లీ
    లేదా
  • హెక్సాకోనాజోల్ – 2.0 మి.లీ
    లేదా
  • ప్రోపికోనాజోల్ – 1.0 మి.లీ

ఈ పర్యటనల్లో సస్య రక్షణ శాస్త్రవేత్త డాక్టర్ రేవతి, ఆయా ప్రాంతాల రైతులు పాల్గొన్నారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్  కోసం  X , ఫేస్​బుక్​ పేజీ, వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Previous articleWarangal Market Prices | మిర్చి రేటు జిగేల్.. క్వింటాల్ @ ₹39,000! పత్తి ధర ఎలా ఉందంటే?
Next articleVegetable Farming | రాష్ట్రంలో కూరగాయల కొరతకు చెక్: 800 మంది రైతులను ‘వెజిటబుల్ వాలంటీర్లు’గా తయారు చేస్తాం
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here