ఆటమ్ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ AtumVader
గంటకు 65కి.మి వేగం, 100కి.మి రేంజ్
హైదరాబాద్‌కు చెందిన ఈవీ వీలర్ స్టార్టప్ కంపెనీ Atumobile సంస్థ భారతీయ మార్కెట్లలో తమ రెండో ఎలక్ట్రిక్ టూ వీలర్ విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఈ కంపెనీ విడుదల చేసిన ఆటమ్ వాడెర్ (AtumVader) కోసం ఈ కంపెనీ ఆటోమొబైల్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ARAI) నుంచి ధృవీకరణను పొందింది. ఇదొక కేఫ్ రేసర్ డిజైన్ కలిగిన బైక్. కంపెనీ దీనిని తెలంగాణలోని ఫ్యాక్టరీలోనే ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు చేస్తోంది.రెండో ఎలక్ట్రిక్ బైక్..
2020 సెప్టెంబరులో Atumobile సంస్థ తమ మొదటి ఎలక్ట్రిక్ బైక్ "ఆటమ్ 1.0ను ఇండియన్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభ ధర కేవలం రూ.50,000 మాత్రమే ఉంది. అయితే గత రెండు సంవత్సరాల్లో ఈ ఎలక్ట్రిక్ బైక్ కు డిమాండ్ పెరగడంతో కంపెనీ దీని ధరను కూడా భారీగా పెంచింది. మార్కెట్లో ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభ ధ...