Bajaj Chetak 2024 : సరికొత్త అప్డేట్స్ తో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్!
Bajaj Chetak 2024 : 2024 కొత్త సంవత్సరాన్ని గ్రాండ్‌గా మొదలుపెట్టేందుకు పూర్తి ఏర్పాట్లు చేసుకుంది దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto). ఈ నేపథ్యంలోనే .. 2024 బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చింది. జనవరి 9న ఈ అప్డేటెడ్ ఈ-స్కూటర్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఓసారి చూద్దాం..
2024 బజాజ్ చేతక్ ఈవీ..
Bajaj Chetak 2024 ఈ అప్డేటెడ్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్, మెకానికల్స్‌లో భారీ మార్పులు కనిపిస్థాయని తెలుస్తోంది. ఇందులో 3.2 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాట్రీ ప్యాక్ ఉండనుంది. ప్రస్తుతం ఉన్న మోడల్లో 2.88 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ యూనిట్ ఉంది. అంతేకాకుండా .. ప్రస్తుతం ఈ వెహికిల్ ర 113 కి.మీ రేంజ్ ఇస్తుంది . ఇక బ్యాటరీ సామర్థ్యం పెరుగుతుండటంతో.. కొత్త బజాజ్ చేతక్ ఈవీ రేంజ్ ...