Harithamithra Telugu News

Home Agricultue వ్యవసాయ వార్తలు Farmers Support | అకాల వర్షాల బాధితులకు ఊరట, డెయిరీ అభివృద్ధి, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు...

Farmers Support | అకాల వర్షాల బాధితులకు ఊరట, డెయిరీ అభివృద్ధి, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్

0
Telangana Cabinet Decisions

Telangana Cabinet Decisions : రాష్ట్రంలో రైతుల సంక్షేమం, పాడి పరిశ్రమ అభివృద్ధి, పునరుత్పాదక ఇంధన వనరుల పెంపునకు ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలకు ఆమోదం లభించింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో పంటలు, పంట ఉత్పత్తులు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నష్టంపై తక్షణమే వివరాలను సేకరించి, బాధితులైన రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంచార్జి మంత్రులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

నార్మక్ (NARMAC) ఇక ఎన్డీడీబీ పరిధిలోకి

నల్గొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని (NARMAC) నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుకు (NDDB) అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ ఎంవోయూ (MoU) ఒప్పందంతో, ఇకపై పాల సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ మరియు డెయిరీ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలను ఎన్డీడీబీ చేపట్టనుంది. ఇది పాడి రైతులకు మరింత ఆదాయాన్ని, మెరుగైన సేవలని అందించే దిశగా అడుగు.

సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్లు

రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో 33/11 కేవీ సబ్స్టేషన్ల వద్ద సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా మొదట 18 ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. సుమారు రూ.66.50 కోట్ల వ్యయంతో 19 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. తెలంగాణ ఇంధన రంగాన్ని స్వయం సమృద్ధం చేసే దిశగా ఇది ఒక కీలక ముందడుగు.

Previous articleఎద్దులతో విద్యుత్ ఉత్పత్తి: ‘నంది రథం’ – గ్రామీణ భారత్‌లో సరికొత్త ఇంధన విప్లవం! – Nandi Rath bull powered electricity
Next articleఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో ఏప్రిల్ హవా: అమ్మకాల్లో నెలవారీ తగ్గుదల..
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here