
కేవలం ₹49,999 కే TVS Orbitor V1 ‘BaaS’ మోడల్‌తో బ్యాటరీ టెన్షన్ ఇక లేదు..
భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో మరో కీలక అడుగు పడింది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS Motor Company కొత్త ఆర్బిటర్ V1 ఎలక్ట్రిక్ స్కూటర్ (TVS Orbitor V1) ను మార్కెట్లోకి విడుదల చేసింది. బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) అనే వినూత్న మోడల్‌తో ఈ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఈ స్కూటర్ ప్రారంభ ధర ₹49,999 (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించారు. ఇది కేంద్ర ప్రభుత్వ PM e-Drive Scheme సబ్సిడీతో కలిపి నిర్ణయించిన ధర. అయితే బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేస్తే ధర ₹84,500గా ఉంటుంది.ఏమిటీ బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్?సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలో బ్యాటరీ ఖర్చే ఎక్కువగా ఉంటుంది. ఈ భారాన్ని తగ్గించేందుకు టీవీఎస్ 'BaaS' మోడల్‌ను తీసుకొచ్చింది.తక్కువ ధర: వాహనం కొనేటప్పుడు బ్యాటరీ ధర చెల్లించక్కర్లేదు. అందుకే స్కూటర్ ₹49,999 కే లభిస్తుంది.సబ్‌స్క్రిప్షన...

