ఎలక్ట్రిక్ ఆటోను సౌరశక్తితో నడిచే వాహనంగా మార్చాడు
ఇంధనం లేకుండానే సాఫీ ప్రయాణం
Bhubaneswar : భువనేశ్వర్‌లోని ఒక ఆటో డ్రైవర్ తన ఎలక్ట్రిక్ ఆటోను సౌరశక్తితో నడిచే వాహనంగా మార్చేశాడు. దానిని అతను వీధుల్లో నడుపుతూ జీవనోపాధిని పొందుతున్నాడు. ఆటో డ్రైవర్ శ్రీకాంత్ పాత్ర (Shrikant Patra) యూట్యూబ్ (Youtube) లో చూసి ఈ ఆవిష్కరణ చేశాడు.దీనిపై శ్రీకాంత్ పాత్ర (35) మాట్లాడుతూ, “నేను గత 15 సంవత్సరాలుగా ఆటో రిక్షా నడుపుతున్నాను. ఇంతకుముందు, నేను డీజిల్, పెట్రోల్ కోసం భారీగా ఖర్చు చేసేవాడిని డీజిల్ ఇంజిన్‌తో రోజుకు ఇంధనం ఖర్చులు పోగా రూ. 300 నుంచి రూ.400 మాత్రమే సంపాదించాను. మేము పేదరికంలో జీవిస్తున్నాం. ఆటో ద్వారా వచ్చే డబ్బులతో ఇల్లు నడపలేం.. నా పిల్లలకు స్కూళ్ల ఫీజులను భరించలేను.”
“సుమారు ఒకటిన్నర సంవత్సరాల క్రితం, నేను ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను కొనుగోలు చేసి నగరంలో నడిపాను.. కానీ బ్యాటరీ తక్కువగా ఉండటం, ఛార్జింగ్ సమస్యతో ప్రతిరోజూ పెద్ద టెన్షన్ ...