
BMW electric MINI Cooper SE వస్తోంది..
BMW భారతదేశంలోని ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్‌లో తన ఉనికిని విస్తరించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. గతంలో iX ఎలక్ట్రిక్ SUVని ప్రారంభించిన తర్వాత తాజాగా BMW electric MINI 3-Door Cooper SE మోడల్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది.BMW ఇండియా ఎలక్ట్రిక్ MINI 3-డోర్ కూపర్ SE వాహనాన్ని ఫిబ్రవరి 24న దేశంలో ప్రారంభించబడుతుందని ఒక పత్రికా ప్రకటనలో ధ్రువీకరించింది. దేశంలో లగ్జరీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్ క్రమంగా వేగం పుంజుకుంటున్నప్పటికీ, లగ్జరీ సెగ్మెంట్లో బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ MINI సముచితమైన స్థానాని్న కైవసం చేసుకునే అవకాశం ఉంది.2020లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడిన BMW electric MINI Cooper SE వాహనంలో 32.6 kWhని బ్యాటరీని వినియోగించారు. ఇది ఒకసారి ఫుల్ చార్జి చేస్తే దాదాపు 270 కి.మీల పరిధిని అందిస్తుంది. కానీ MINI అయినందున, ఇది 184 hp, 270 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది....