BMW భారతదేశంలోని ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్‌లో తన ఉనికిని విస్తరించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. గతంలో iX ఎలక్ట్రిక్ SUVని ప్రారంభించిన తర్వాత తాజాగా BMW electric MINI 3-Door Cooper SE మోడల్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది.
BMW ఇండియా ఎలక్ట్రిక్ MINI 3-డోర్ కూపర్ SE వాహనాన్ని ఫిబ్రవరి 24న దేశంలో ప్రారంభించబడుతుందని ఒక పత్రికా ప్రకటనలో ధ్రువీకరించింది. దేశంలో లగ్జరీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్ క్రమంగా వేగం పుంజుకుంటున్నప్పటికీ, లగ్జరీ సెగ్మెంట్లో బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ MINI సముచితమైన స్థానాని్న కైవసం చేసుకునే అవకాశం ఉంది.
2020లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడిన BMW electric MINI Cooper SE వాహనంలో 32.6 kWhని బ్యాటరీని వినియోగించారు. ఇది ఒకసారి ఫుల్ చార్జి చేస్తే దాదాపు 270 కి.మీల పరిధిని అందిస్తుంది. కానీ MINI అయినందున, ఇది 184 hp, 270 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 7.3 సెకన్లలో 100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఇది వైట్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌వాక్ గ్రే, బ్రిటిష్ రేసింగ్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది.
BMW ఎలక్ట్రిక్ MINI లో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను చూడవచ్చు. క్యాబిన్‌లో 8.8-అంగుళాల మెయిన్ డిస్‌ప్లే, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, నప్పా లెదర్ అప్హోల్స్టరీ వంటి అనేక పీచర్లు ఉన్నాయి.
ఎలక్ట్రిక్ MINI కోసం ప్రీ-బుకింగ్‌లు గత సంవత్సరం చివర్లో ప్రారంభించారు. చివరికి EV యొక్క మొదటి 30 యూనిట్లు బుక్ అయినట్లు BMW ధ్రువీకరించింది. దీని ధర సుమారు ₹50 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండవచ్చు.
కూపర్ SE 0-100 kmph నుండి 7.3 సెకన్లలో పరుగెత్తగలదని MINI పేర్కొంది. ఈ ఎలక్ట్రానిక్ car పరిమిత గరిష్ట వేగం 150 kmph. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను 11kW ఛార్జర్‌ని ఉపయోగించి 2.5 గంటల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు, అయితే 50kW DC ఫాస్ట్ ఛార్జర్ తో చార్జ్కే చేస్తే కేవలం 35 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ప్రస్తుతం ఈ కొత్త MINI కూపర్ SE భారతదేశంలో విక్రయించబడుతున్న అత్యంత సరసమైన లగ్జరీ ఎలక్ట్రిక్ కారు.
Nice look