భారత్ లో పవన విద్యుత్ సామర్థ్యం 5 రెట్లు పెరిగింది.. సోలార్, ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుతున్నాయ్..
భారతదేశం పర్యావరణ అనుకూలమైన గ్రీన్ ఎనర్జీ వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. పునరుత్పాదక శక్తులైన పవన విద్యుత్, సోలార్ విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీని, వినియోగాన్ని పెంచుకుంటూ పోతోంది. 2000 నుండి 2022 వరకు ప్రతీ సంవత్సరం, భారతదేశం తన పవన శక్తి సామర్థ్యాన్ని 22 శాతం, సౌర సామర్థ్యాన్ని 18 శాతం పెంచుకుంది.భారతదేశం తన పవన శక్తి (Wind Energy) సామర్థ్యాన్ని ఐదు రెట్లు పెంచుకుంది. 2016 నుంచి 2022 మధ్య దాని సౌర సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేసింది. పునరుత్పాదక సామర్థ్యం (India Renewable Energy) లో దేశం వృద్ధి.. బొగ్గు శక్తి వృద్ధిని మించిపోయిందనడానికి నిదర్శనం. కాలుష్యకారకమైన పెట్రోల్, డీజిల్ ఇందనాలకు ప్రత్నాయ్నాయంగా కేంద్రం పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వైపు మారేందుకు భారతదేశం ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఈ ప్రయాణంలో ఆటోమోటివ్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోంది.అంతర్జాతీయ పర...