టాటా టియాగో EV, MG కామెట్ EVకి పోటీగా రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కారు వస్తోంది..
Renault Kwid EV | ఇటీవల యూరప్ లో కనిపించిన Dacia Spring ఆల్-ఎలక్ట్రిక్ కారు త్వరలో అంతర్జాతీయ మార్కెట్‌లలో Renault Kwid EVగా రీబ్రాండ్ చేయవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి, ఇది భారతదేశంలో విక్రయిస్తున్న రెనాల్ట్ క్విడ్ పెట్రోల్-ఆధారిత డాసియా స్ప్రింగ్ కు ఎలక్ట్రిక్ వెర్షన్ రెనాల్ట్ 2020 ఆటో ఎక్స్‌పోలో Kwid EV కాన్సెప్ట్‌ను కూడా ప్రదర్శించింది. అయితే ఈ Dacia Spring EV త్వరలోనే రెనాల్ట్ క్విడ్ EV గా భారతదేశానికి వస్తుదని సమాచారం. ఇదే నిజమైతే రెనాల్ట్ ఈవీ టాటా టియాగో EV తోపాటు MG కామెట్ EV వంటి ఎంట్రీ-లెవల్ EVలకు గట్టి పోటీ ఇవ్వనుంది. రెనాల్ట్ Kwid EV దాని సమీప ప్రత్యర్థులతో ఎలా పోటీ ఇవ్వగలదో ఒకసారి చూడండి..
Renault Kwid EV పవర్‌ట్రెయిన్ స్పెక్స్
Kwid EV 26.8kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది ఒక ఛార్జ్‌పై 230 కిమీ (WLTP) వరకు రేంజ్ ని అందిస్తుంది. దీని ప్రకారం.. టి...