Video | ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రాన్ని మీరు ఎప్పుడైనా ఊహించారా.. అయితే ఓసారి చూడండి..
Eco-Friendly Polling Booths | తమిళనాడులోని ఈ పర్యావరణ అనుకూల పోలింగ్ బూత్‌లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ పోలింగ్ కేంద్రాలను పూర్తిగా కొబ్బరి, వెదురు ఆకులతో అందంగా తీర్చిదిద్దారు. ఈ ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ బూత్ కు సంబంధించిన వీడియోను ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియా సాహు ఇటీవల షేర్ చేయగా.. అది నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో క్లిప్ తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఒక ప్రత్యేక "గ్రీన్ పోలింగ్ బూత్ ను చూపిస్తుంది. ఈ వినూత్న బూత్, జిల్లా కలెక్టర్, TN క్లైమేట్ చేంజ్ మిషన్ వాలంటీర్ల మధ్య సహకారం, పర్యావరణంపై స్పృహను హైలెట్ చేస్తుంది. వేవిలో ఎండలు తీవ్రమైన నేపథ్యంలో ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా నీడ తాటి, కొబ్బరి ఆకులతో చలువ పందిళ్లు వేశారు. అలాగే అలంకరణ కోసం సహజ పదార్థాలు, పువ్వులతో పోలింగ్ బూత్ ను అందంగా తీర్చిదిద్దారు. ఈ పర్యావరణ అనుకూలమైన బూత్‌లు మొత్తం 10 వరకు ఏర్పాటు చేశారు. ఇవి ఒక కొత్తద...