తిరుమలలో భక్తుల కోసం ఎలక్ట్రిక్ బస్సులు
Electric Buses in Tirumala: ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల దేవస్థానానికి కొత్తగా ఎలక్ట్రిక్ ధర్మరథాలు వచ్చేశాయి. తిరుమలలో ఈ బస్సులు భక్తులు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తాయి. మొత్తం 10 బస్సులను మేఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ విరాళంగా ఇచ్చింది.
Electric Buses in Tirumala: తిరుమలలో భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు 10 Electric buses (ఎలక్ట్రిక్ బస్సులు) సిద్ధమయ్యాయి. ఈ విద్యుత్ ధర్మరథాలను తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam - TTD) చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి (YV Subba Reddy) మార్చి 27న ప్రారంభించారు. చైర్మన్‍తో పాటు టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం ఈ ధర్మరథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పచ్చజెండా ఊపి ఈ బస్సులను ప్రారంభించారు. ఈ విద్యుత్ ధర్మరథాల్లో ప్రయాణించి ట్రయల్ రన్ నిర్వహించారు. రూ.84 కోట్ల విలువైన ఈ 10 ఒలెక్ట్రా కంపెనీ ఎలక్ట్రిక్ బస...