Hero Motocorp Surge S32 | 2 ఇన్ 1 వాహనం చూశారా? 3 నిమిషాల్లోనే త్రీవీలర్ నుంచి స్కూటర్ గా మార్చుకోవచ్చు..
Hero Motocorp Surge S32 | మీరు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన డార్క్ నైట్ సినిమాను చూశారా.. అందులో బాట్‌మాన్ కారులో ఒక్క బటన్ నొక్కగానే అందులో నుంచి బైక్ ఒకటి బయటకు దూసుకువస్తుది. హాలివుడ్ సినిమాల్లోనే చూసిన ఈ అద్భుతమైన సన్నివేశం ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ సాధ్యమైంది. భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ, హీరో మోటోకార్ప్ యాజమాన్యంలోని సర్జ్ స్టార్టప్ కూడా సరిగ్గా ఇలాంటి ఆవిష్కరణ చేసింది. ఇది ఒక ప్రత్యేకమైన త్రీ-వీలర్ ఎలక్ట్రిక్ వాహనం.. కానీ కేవలం మూడు నిమిషాల్లోనే ఇది ఒక ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్కూటర్‌గా మారుతుంది. స్వయం ఉపాధి పొందే వ్యక్తుల కోసం ప్రత్యేకమైన త్రీ-వీలర్ కమ్ స్కూటర్ ను రూపొందించింది. ఒకే వాహనంలో ఎలక్ట్రిక్ రిక్షా తోపాటు ఎలక్ట్రిక్ స్కూటర్ రెండింటిని అవసరాన్ని బట్టి వినియోగించుకోవడం దీని ప్రత్యేకత.భారత ఆటోమొబైల్ రంగంలో ఊహించని విధమైన సరికొత్త ఆవిష్కరణలు వెలుగుచూస్తున్నా...