
మండుటెండలోనూ మీ ఇల్లును పార్క్‌లా మారాలా? వేసవిలో పూసే ఈ 10 మొక్కలు నాటితే చాలు – Summer Flowering Plants
Summer Flowering Plants in India | వేసవి వచ్చిందంటే చాలు భానుడి ప్రతాపానికి మనుషులే కాదు. పశుపక్ష్యాదులు తల్లడిల్లిపోతాయి. అయితే మండుటెండలోనూ అందమై పువ్వులు పూస్తూ వేసవిని రంగులమయం చేసే కొన్ని మొక్కల గురించి మీకు తెలుసా.. మీ బాల్కనీని లేదా పెరడు ఆకుపచ్చగా అందంగా మార్చడం గురించి ఆలోచిస్తున్నారా, ఈ వేసవి సీజన్ లో పుష్పించే మొక్కలు మిమ్మల్ని అబ్బురపరచడానికి చాలా ఉన్నాయి..ఈ వేసవి పువ్వుల (Summer flower plants) గురించి ఎందుకు శ్రద్ధ వహించాలి? అవి అందంగా కనిపించడంతోపాటు అవి మన పర్యావరణ వ్యవస్థలో భాగం. పూల మొక్కలు తేనెటీగలు, సీతాకోకచిలుకల మనుగడకు ప్రాణం పోస్తాయి. భారతదేశంలో వేసవిలో ఏయే పూల మొక్కలు నాటాలి? సమ్మర్ సీజన్ ఫ్లవర్ ప్లాంట్‌ల జాబితాను ఒకసారి పరిశీలించండి..Summer Flowering Plantsకాస్మో (Cosmo)బంతి పువ్వు (Marigold)మందార (Hibiscus)బౌగెన్విల్లా (Bougainvillea)...

