హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తోంది..
చైనాలో Honda U-GO E-Scooter విడుదల
త్వరలో ఇండియాలోకి..
గంటకు 53కిమీ వేగం
డ్యూయల్ బ్యాటరీతో సింగిల్ చార్జిపై 130కి.మి రేంజ్‌పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతుండడంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. క్రమంగా అనేక చిన్నాచితక కంపెనీలతోపాటు కార్పొరేట్ దిగ్గజాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోకి వస్తున్నాయి. తాజాగా ప్రఖ్యాత ఆటోమొబైల్ దిగ్గజం హోండా.. కొత్తగా ఎలక్ట్రిక్ వాహనరంగంలోకి దిగింది. ఇటీవలే ఒక సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. అయితే అది మనదేశంలో కాదు. చైనాలో Honda U-GO E-Scooter ను ప్రవేశపెట్టింది.హోండా సంస్థ కొత్తగా Honda U-GO E-Scooter ను ప్రస్తుతం చైనా మార్కెట్లో ప్రవేశపెట్టగా త్వరలో ఇండియాతోపాటు ఇతర దేశాల్లోనూ విస్తరించనుంది. హోండా యొక్క చైనీస్ అనుబంధ సంస్థ ఇ-స్కూటర్‌ను CNY 7,499 సరసమైన ధర వద్ద ప...