చైనాలో Honda U-GO E-Scooter విడుదల
త్వరలో ఇండియాలోకి..
గంటకు 53కిమీ వేగం
డ్యూయల్ బ్యాటరీతో సింగిల్ చార్జిపై 130కి.మి రేంజ్
పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతుండడంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. క్రమంగా అనేక చిన్నాచితక కంపెనీలతోపాటు కార్పొరేట్ దిగ్గజాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోకి వస్తున్నాయి. తాజాగా ప్రఖ్యాత ఆటోమొబైల్ దిగ్గజం హోండా.. కొత్తగా ఎలక్ట్రిక్ వాహనరంగంలోకి దిగింది. ఇటీవలే ఒక సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. అయితే అది మనదేశంలో కాదు. చైనాలో Honda U-GO E-Scooter ను ప్రవేశపెట్టింది.
హోండా సంస్థ కొత్తగా Honda U-GO E-Scooter ను ప్రస్తుతం చైనా మార్కెట్లో ప్రవేశపెట్టగా త్వరలో ఇండియాతోపాటు ఇతర దేశాల్లోనూ విస్తరించనుంది. హోండా యొక్క చైనీస్ అనుబంధ సంస్థ ఇ-స్కూటర్‌ను CNY 7,499 సరసమైన ధర వద్ద ప్రవేశపెట్టగా, U-GO ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.86,000లకు అందుబాటులో ఉంది. అంటే ఇది TVS iQube, ఏథర్ 450ఎక్స్, బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే చాలా చవకైనంది. స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఒక లోస్పీడ్ రెగ్యులర్. మరోకటి కొద్దిపాటి డిజైన్ థీమ్‌తో ఆధునికమైన హైస్పీడ్ వేరియంట్. ఇక ఈ స్కూటర్‌ను పరిశీలిస్తే ముందువైపు గుర్రపుడెక్క ఆకారంలో LED DRL తో LED హెడ్‌ల్యాంప్‌ను చూడవచ్చు. బ్లింకర్లు హ్యాండిల్‌బార్‌లోనే ఉంటాయి. వెనుక నుంచి కూడా, హోండా U-GO స్లిమ్ టెయిల్ ల్యాంప్‌తో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. U-GO స్కూటర్ సైడ్ ప్రొఫైల్ చాలా చక్కగా కనిపిస్తుంది. సింగిల్-పీస్ సీటుతోపాటు ఆకర్షణీయమైన గ్రాబ్ రైల్‌తో, పిలియన్ సీట్ ఉంటుంది.
అత్యాధునిక ఫీచర్లతో..
అలాగే, Honda U-GO E-Scooter సింగిల్-టోన్ కలర్ స్కీమ్‌ను ఫంకీ గ్రాఫిక్స్ లేకుండా ఉపయోగించారు. బ్లాక్ ప్లాస్టిక్ ప్యానెల్స్ జోడించడం ఈ స్కూటర్‌కు ప్రత్యేకంగా అందాన్నిచ్చింది. అంతేకాకుండా ఫ్లోర్‌బోర్డ్ 350 మిమీ మేర పొడవు కలిగి ఉంటుంది. U-GO అనేది భవిష్యత్ స్కూటర్. ఇందులో ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో LED లైటింగ్, యాంటీ-థెఫ్ట్ అలారం, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. అలాగే ఒక LCD, USB ఛార్జింగ్ పాయింట్‌తో వస్తుంది. Honda U-GO E-Scooterలో 26 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ ఉండడం మంచి విషయంగా చెప్పవచ్చు. అలాగే ఇక టైర్ల విషయానికొస్తే ముందు భాగంలో 12-అంగుళాల రిమ్ మరియు వెనుకవైపు 10-అంగుళాల టైర్లను వినియోగించారు.
గంటకు 53కిలోమీటర్ల వేగం
Honda U-GO E-Scooterలో 48 వోల్ట్ 30 ఏహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను వినియోగించారు. ఇది డిటాచబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ. దీనిని స్కూటర్‌ను విడదీసి ప్రత్యేకంగా చార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్‌లో 1.2 kW DC మోటార్‌ను చూడవచ్చు. తక్కువ స్పీడ్ ట్రిమ్ తక్కువ శక్తివంతమైన 800 W మోటార్ ఉంటుంది. స్కూటర్ ఒక్కసారి చార్జ్ చేస్తే 65 కిమీ వరకు ప్రయాణించవచ్చు. అయితే ఇది అదనపు బ్యాటరీ ప్యాక్‌ని కనక ఉపయోగిస్తే సింగిల్ చార్జ్‌పై దర్జాగా 130 కిమీ వరకు ప్రయాణించవ్చు. ఇక దీని టాప్ స్పీడ్ వేగం గంటకు 53 కిలోమీటర్లు. సీటు ఎత్తు 740 మిమీ.
Very useful for ladies