
Hydro Electric Projects | జలవిద్యుత్‌పై తెలంగాణ సర్కార్ ఆసక్తి
Hydro Electric Projects : బూట్ (BOOT) పద్ధతిలో 22 జల విద్యుత్ కేంద్రాల (Hydro Electric Projects) ఏర్పాటుకు హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ప్రభుత్వం ప్రతిపాదనలను ఆహ్వానించింది. దీనిపై తెలంగాణ (Telangana) ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి మల్లు విక్రమార్క నేతృత్వంలో ఓ బృందం ఈ రోజు (గురువారం) హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లింది.Hydro Electric Projectsపై తెలంగాణ సర్కార్ ఆసక్తిహిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy Chief Minister Mallu Bhatti Vikramarka), విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు (Sukhvinder Singh Sukhu)తో భేటీ అయ్యారు. 100 మెగావాట్లకు పైగా సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులపై ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలిపారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ విద్యుత్ శాఖ కార్యదర్శితో కూడా చర్...