విస్తరణ దిశగా sun mobility
LetsTransport సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యం
ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీ మార్పిడి సేవలను అందించే ప్రముఖ సంస్థ సన్ మొబిలిటీ ( sun mobility ), తాజాగా హైపర్ లోకల్ థర్డ్-పార్టీ లాజిస్టిక్స్ అలాగే లాస్ట్-మైల్ /మిడిల్-మైల్ డెలివరీ రంగ సంస్థ అయిన LetsTransport తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
ఇందులో భాగంగా సన్ మొబిలిటీ తన స్వాప్ టెక్నాలజీతో నడిచే 100 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ కార్గో వాహనాలు ఇప్పటికే ఢిల్లీ-ఎన్సిఆర్, బెంగుళూరు అంతటా విస్తరించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న EV-ఆధారిత చివరి-మైలు డెలివరీ రంగంలో వచ్చే ఏడాదిలో ఈ రెండు సంస్థలు 2,000 వాహనాలకు విస్తరించాలని యోచిస్తున్నాయి.ఇ-కామర్స్, రిటైల్, 3PL, FMCG, బ్లూచిప్ కంపెనీలు అలాగే ఇతర ఎంటర్ప్రైజ్ క్లయింట్లకు సేవలదించాలని కూడా వారు ప్లాన్ చేస్తున్నారు. ఢిల్లీ-NCR, బెంగుళూరు తర్వాత హైదరాబాద్, ముంబై, పూణే, జైపూర్, అహ్...