అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ టాప్.. మరో రెండు నగరాలు కూడా
Most Polluted Cities | ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని న్యూఢిల్లీని (New Delhi) దీపావళి (Diwali) వేడుకలు మరింత కష్టాల్లోకి నెట్టింది.. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కాలుష్యం తార స్థాయికి చేరింది. దీపావళి ఎఫెక్ట్‌తో దేశంలోని మరో రెండు నగరాలు కూడా ఢిల్లీ సరసన చేరాయి.
ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని ఢిల్లీని (New Delhi).. దీపావళి (Diwali) వేడుకలు మరింత కష్టాల్లోకి నెట్టాయి.. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరింది. తేలికపాటి వర్షంతో గత శనివారం నగరంలో పరిస్థితి కాస్త మెరుగుపడింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా ఢిల్లీ వాసులు ఆదివారం పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చడంతో ఢిల్లీలో మరోసారి దట్టమైన పొగ అలుముకుంది. దీంతో ఏక్యూఐ(AQI) అత్యంత ప్రమాదకర స్థాయికి ఎగబాకింది. గత ఆదివారం రాత్రి ఏకంగా 680 కి పెరిగినట్లు వాతావరణ శాఖ వెల్లడించ...