
Most Polluted Cities | ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని న్యూఢిల్లీని (New Delhi) దీపావళి (Diwali) వేడుకలు మరింత కష్టాల్లోకి నెట్టింది.. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కాలుష్యం తార స్థాయికి చేరింది. దీపావళి ఎఫెక్ట్‌తో దేశంలోని మరో రెండు నగరాలు కూడా ఢిల్లీ సరసన చేరాయి.
ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని ఢిల్లీని (New Delhi).. దీపావళి (Diwali) వేడుకలు మరింత కష్టాల్లోకి నెట్టాయి.. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరింది. తేలికపాటి వర్షంతో గత శనివారం నగరంలో పరిస్థితి కాస్త మెరుగుపడింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా ఢిల్లీ వాసులు ఆదివారం పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చడంతో ఢిల్లీలో మరోసారి దట్టమైన పొగ అలుముకుంది. దీంతో ఏక్యూఐ(AQI) అత్యంత ప్రమాదకర స్థాయికి ఎగబాకింది. గత ఆదివారం రాత్రి ఏకంగా 680 కి పెరిగినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా బాణసంచాతో దేశంలోని మరో రెండు ప్రధాన నగరాలు కూడా ఢిల్లీ సరసన చేరాయి.
స్విస్ గ్రూప్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Swiss group IQAir) జాబితా
ప్రపంచంలోనే 10 అత్యంత కాలుష్య నగరాల జాబితాను (World Most Polluted Cities) స్విస్ గ్రూప్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Swiss group IQAir) విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో దేశరాజధాని ఢిల్లీ అగ్ర స్థానంలో నిలిచింది. ఇక మరో రెండు భారతీయ నగరాలు సైతం టాప్ 10లో నిలిచాయి. దీపావళి కారణంగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా(Kolkata), మహారాష్ట్ర రాజధాని ముంబై(Mumbai) నగరాలు కూడా తీవ్ర వాయు కాలుష్యంలో చిక్కుకుపోయాయి. సోమవారం ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 420 గా నమోదైంది. ఇది ప్రమాదకర కేటగిరీ కిందికి వస్తుంది. ఇదే జాబితాలో ఎయిర్ క్వాలిటీ సూచిక 196 తో కోల్‌కతా నగరం నాలుగో స్థానంలో ఉంది. ఎయిర్ క్వాలిటీ సూచిక 163తో ముంబై సిటీ 8వ స్థానంలో నిలిచింది.
ఏక్యూఐ సూచిక 400 నుంచి 500 మధ్య నమోదు అయితే వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు భావిస్తారు. ఈ స్థాయిలో ఉండే వాయుకాలుష్యం ఆరోగ్యవంతమైన వ్యక్తులపై కూడా హానికర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే వ్యాధులతో బాధపడుతున్నవారికి ఇది అత్యంత తీవ్రమైన ప్రమాదకరం. ఎయిర్ క్వాలిటీ సూచిక 150 నుంచి 200 మధ్య నమోదైతే అస్తమా, ఊపిరితిత్తులు, గుండె సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఏక్యూఐ 0 నుంచి 50 మధ్య ఉంటే మాత్రమే పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్లు భావిస్తారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..