microplastics : ప్రతీ వ్యక్తి ఏడాదికి రెండు పాలిథిన్ సంచులను మింగుతున్నారు.. మైక్రో ప్లాస్టిక్ తో పెను ప్రమాదం.. ముఖ్యంగా..
మైక్రో ప్లాస్టిక్ తో వంధ్యత్వం వచ్చే ప్రమాదం
microplastics : నిత్య జీవితంలో మనం ప్లాస్టిక్ వస్తువులు లేని రోజును మనం ఊహించుకోలేం.. దాదాపు చాలా సందర్భాల్లో ప్లాస్టిక్ వస్తువులు, కవర్లను వాడుతున్నారు. అయితే తాజాగా ఓ అధ్యయం ద్వారా ప్లాస్టిక్ కు సంబంధించి మరో చేదు నిజం వెలుగులోకి వచ్చింది. మైక్రో ప్లాస్టిక్ వల్ల పుట్టిన బిడ్డలు వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. బ్రిటన్‌లోని పోర్ట్స్‌మౌత్ విశ్వవిద్యాలయం ఆహారంలో ఉండే మైక్రోప్లాస్టిక్ పై పరిశోధనలు చేసింది. ఆహారంలో మైక్రో ప్లాస్టిక్ ను గుర్తించడానికి ప్లాస్టిక్ ప్యాకింగ్‌లో చుట్టిన ఆహారంతోపాటు ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేయని ఆహారపదార్థాలను సేకరించి పరిశోధించింది.
అయితే ఈ అధ్యయనంలో ప్లాస్టిక్ ప్యాకింగ్ వస్తువులలో దాదాపు 2.30లక్షల మైక్రోప్లాస్టిక్‌లను కనుగొనగా, రెండవ ప్యాకింగ్‌లో 50,000 మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నాయి. పరిశోధకు...