sustainable Kumbh Mela 2025 | మహా కుంభమేళాలో పర్యావరణ సవాళ్లకు పరిష్కారాలు ఎలా?
sustainable Kumbh Mela 2025 | ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటైన కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అంగరంగ వైభవంగా జరుగుతుంది. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు ఉత్తరప్రదేశ్ జిల్లా ప్రయాగ్‌రాజ్ నిర్వహించనున్నారు. ఈ మేళా సమయంలో నదులలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇది మన పాపాలను తొలగిస్తుందని ఆధ్యాత్మికంగా పునరుజ్జీవింపజేస్తుందని విశ్వసిస్తారు.కుంభమేళా (Kumbh Mela 2025 ) ప్రాముఖ్యతకుంభమేళా భారతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది, పవిత్ర జలాల్లో పుణ్యస్నానాలు, గంగా హారతుల కోసం లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు, ప్రసంగాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, శోభాయాత్రలు, భారతదేశం సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటుతుంది.కుంభమేళా ఒక స్మారక ఆధ్యాత్మిక కార్యక్రమం అయితే, దాని పెద...