Help Birds in Summer | ఈ వేసవిలో పక్షులకు మీ సహాయం కావాలి.. మీరు సులువుగా చేయగలిగేవి ఇవీ..
How to Help Birds in Summer | వేసవికాలం ఆరుబయట ఆనందించడానికి ఇది చక్కని సీజన్. ప్రకృతి ప్రేమికులు బాల్కనీ లేదా పెరడులో పక్షులను చూసి మురిసిపోయేందుకు కూడా ఇది సరైన సమయం. అయితే, వేసవి మండుటెండలు ఈ రెక్కలు గల చిన్న జీవులకు అత్యంత కఠినంగా ఉంటుంది. ఒక్కోసారి పక్షుల పాలిట ప్రాణాంతకంగా మారవచ్చు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పక్షులు వేసవి ఎండలను తట్టుకుని నిలబడటానికి మీరూ సహాయపడవచ్చు. పిచ్చుకల కోసం మీ బాల్కనీలు, కిటికీలు, పెరడులు, నివాస సముదాయాలను చక్కగా ఉపయోగించుకోవచ్చు
నీటి పాత్రలు :
మీరు తాగునీటి కోసం మట్టి పాత్రలను నీడ ఉన్న ప్రాంతంలో ఉంచవచ్చు. పక్షులు ఆ నీటిని తాగడానికి మాత్రమే ఆగవు,. గిన్నెలోని నీటిలో మునిగి తేలుతూ.. స్నానం చేస్తూ కూడా మీలాగే ఈ వేసవిని ఆనందించవచ్చు! ప్రతిరోజూ శుభ్రమైన నీటితో గిన్నెను నింపడం మర్చిపోవద్దు. ముందుగా, మీరు అందించే నీరు శుభ్రంగా, తాజాగా ఉండేలా చూసుకో...