
Summer flowering plants | మీ తోటలోకి హమ్మింగ్‌బర్డ్స్ రావాలా? అయితే ఈ మొక్కను నాటండి!
హమ్మింగ్‌బర్డ్స్‌ను ఆకర్షించే 'మోంట్‌బ్రెటియా'.. సాగు, సంరక్షణ చిట్కాలు!Summer flowering plants in india | తోటలో పూల మొక్కలు ఉండటం ఒకెత్తయితే, విభిన్న రంగులతో పక్షులను, సీతాకోకచిలుకలను ఆకర్షించే మొక్కలు ఉండటం మరో ఎత్తు. 'మోంట్‌బ్రెటియా'. దీనినే వృక్షశాస్త్ర నామంతో 'క్రోకోస్మియా' అని పిలుస్తారు. ఎండను ఇష్టపడే ఈ మొక్క మీ ఇంటి ఆవరణకు కొత్త కళను తెస్తుంది.మోంట్‌బ్రెటియా(Montbretia plant) అంటే ఏమిటి?ఆఫ్రికా ఖండానికి చెందిన ఈ మొక్క ఐరిస్ (Iris) కుటుంబానికి చెందినది. ఇది బహువార్షిక (Perennial) మొక్క, అంటే ఒకసారి నాటితే ఏళ్ల తరబడి పూలు పూస్తుంది. జూలై, ఆగస్టు నెలల్లో దీనికి ఎరుపు, నారింజ లేదా బంగారు రంగులో గొట్టం ఆకారపు పువ్వులు వికసిస్తాయి. వీటి ఆకులు పట్టీల వలె పొడవుగా ఉండి, మొక్కకు ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తాయి.ముఖ్య లక్షణాలువసంతంలో దుంపల నుంచి మొలకెత్తే మొక్కవరుసగా పూ...


