అదిరే లుక్ తో Svitch CSR 762 Electric Bike
విడుదలకు సిద్ధమైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్
వర్ధమాన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ స్విచ్ మోటోకార్ప్ (Svitch Motocorp), భారత మార్కెట్‌లో సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను (electric motorcycle) విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను CSR 762 అని పిలుస్తారు. ఇది ఈ సంవత్సరం జూలై-ఆగస్టు నాటికి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. CSR 762 ఎలక్ట్రిక్ బైక్‌లో శక్తివంతమైన 3 kW ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. ఇది మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ సెంట్రల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో 3.7 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు.Svitch CSR 762 Specifications
ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ గరిష్టంగా 110 kmph వేగంతో దూసుకెళ్తుంది. ఒక్కసారి చార్జి చేస్తే 120 km రేంజ్‌ను అందజేస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. ఇతర స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. వీల్‌బేస్ 1,430 మిమీ, బరువు 155 కిలోలు ఉంటుం...