Tata Altroz EV | టాటా పంచ్ ఈవీ వచ్చేసింది.. ఇక ఆల్ట్రోజ్ EV విడుదలయ్యేది అప్పుడే..
Tata Altroz EV | టాటా మోటార్స్ EV విభాగంలోకి 2025 నాటికి మరో నాలుగు కార్లను చేర్చేందుకు సిద్ధమవుతోంది. టాటా మోటార్స్ 2019 జెనీవా మోటార్ షోలో ఆల్ట్రోజ్ EVని ప్రదర్శించింది. 2020 ఆటో ఎక్స్పోలో క్లోజ్-టు-ప్రొడక్షన్ రూపంలో కూడా ప్రదర్శించింది. అయితే కొత్తగా తీసుకురాబోతున్న నాలుగు ఎలక్ట్రిక్ కార్లలో ఇది మొదటిదిగా భావిస్తున్నారు. ఈ కాన్సెప్ట్ మొదటిసారి ప్రపంచ ప్రేక్షకులకు ప్రదర్శించబడిన ఐదు సంవత్సరాల తర్వాత ఆల్ట్రోజ్ EV 2025లో భారతదేశంలో ప్రారంభించబడుతుందని తాజాగా తెలిసింది….