ఆ నగరానికి 60 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు
టాటా మోటార్స్‌తో ఒప్పందం
స్థిరమైన ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడంలో తన నిబద్ధతను బలోపేతం చేసుకుంటోంది టాటా మోటార్స్ సంస్థ. తాజాగా టాటా మోటార్స్ అహ్మదాబాద్ జన్మార్గ్ లిమిటెడ్ (AJL)కి 60 Ultra Urban e-bus లను డెలివరీ చేసింది. టాటా అల్ట్రా అర్బన్ 9/9 AC బస్సులను అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ ఈవెంట్ సెంటర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అహ్మదాబాద్ మేయర్ కిరిత్‌కుమార్ పర్మార్ తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. టాటా మోటార్స్, AJLతో గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) ద్వారా FAME II కింద 24-సీట్ల సామర్థ్యం కలిగిన జీరో-ఎమిషన్ బస్సులను సరఫరా చేసింది. ఇవి అహ్మదాబాద్ బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (BRTS) కారిడార్‌లో రాకపోకలు సాగిస్తాయి. టాటా మోటార్స్ బస్సుల సజావుగా పనిచేసేందుకు అవసరమైన ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అలాగే సపోర్ట్ సిస్టమ్‌లను కూడా ఏర్పాటు చేస్తుంది.
...