ఆ న‌గ‌రానికి 60 అత్యాధునిక ఎల‌క్ట్రిక్ బ‌స్సులు

Spread the love

టాటా మోటార్స్‌తో ఒప్పందం

స్థిరమైన ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ప్రోత్సహించడంలో తన నిబద్ధతను బలోపేతం చేసుకుంటోంది టాటా మోటార్స్ సంస్థ‌. తాజాగా టాటా మోటార్స్ అహ్మదాబాద్ జన్మార్గ్ లిమిటెడ్ (AJL)కి 60 Ultra Urban e-bus ల‌ను డెలివరీ చేసింది. టాటా అల్ట్రా అర్బన్ 9/9 AC బస్సులను అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ ఈవెంట్ సెంటర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అహ్మదాబాద్ మేయర్ కిరిత్‌కుమార్ పర్మార్ త‌దిత‌రులు జెండా ఊపి ప్రారంభించారు. టాటా మోటార్స్, AJLతో గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) ద్వారా FAME II కింద 24-సీట్ల సామ‌ర్థ్యం క‌లిగిన జీరో-ఎమిషన్ బస్సులను స‌ర‌ఫ‌రా చేసింది. ఇవి అహ్మదాబాద్ బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (BRTS) కారిడార్‌లో రాక‌పోక‌లు సాగిస్తాయి. టాటా మోటార్స్ బస్సుల సజావుగా పనిచేసేందుకు అవసరమైన ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అలాగే సపోర్ట్ సిస్టమ్‌లను కూడా ఏర్పాటు చేస్తుంది.

 

శ‌క్తిమంత‌మైన ఎల‌క్ట్రిక్ బ‌స్సులు

టాటా Ultra Urban e-bus పూర్తి-ఎలక్ట్రిక్ డ్రైవ్ ట్రైన్‌ల ద్వారా శక్తిని పొందుతాయి, గరిష్ట శక్తి 328hp గా ఉంటుంది. ఈ ఎల‌క్ట్రిక్ బ‌స్సు గరిష్టంగా 3000Nm టార్క్‌ను జ‌న‌రేట్ చేస్తుంది. ఖరీదైన ఇంటీరియర్ లైటింగ్‌తో వస్తాయి. క్లచ్, గేర్ షిఫ్టింగ్ లేకుండా అల‌స‌ట లేని డ్రైవింగ్ అనుభవాన్ని అందించేలా ఈ అల్ట్రా అర్బన్ 9/9 ఈ-బస్సులు రూపొందించ‌బ‌డ్డాయి. అలాగే ఇందులో రీజ‌న‌రేటింగ్ బ్రేకింగ్ సిస్టమ్, న్యూ జ‌న‌రేష‌న్ టెలిమాటిక్స్, హై-సెక్యూరిటీ ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ITS) వంటి ఫీచ‌ర్ల‌త వస్తాయి.
ఈ సందర్భంగా టాటా మోటార్స్ ప్రొడక్ట్ లైన్- వైస్ ప్రెసిడెంట్ రోహిత్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, “టాటా అల్ట్రా అర్బన్ 9/9 ఎలక్ట్రిక్ బస్సులను AJLకి అందించడం త‌మ‌కు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రజా రవాణాను ఆధునీకరించడం, భవిష్యత్ వాహనాల రూపకల్పనలో సుస్థిరత సాధించ‌డం త‌మ ల‌క్ష్మ‌మ‌ని తెలిపారు. శబ్దరహిత, జీరో ఎమిష‌న్‌తో మెరుగైన సౌకర్యం, భద్రత, ప‌వ‌ర్‌ఫుల్ అయిన ఈబ‌స్సులు ప్ర‌యాణికుల‌కు చ‌క్క‌ని అనుభూతినిస్తాయ‌ని తెలిపారు. ఈ బస్సుల డెలివరీ AJLతో మా ఫలవంతమైన అనుబంధాన్ని మరింత సుస్థిరం చేస్తుంది మరియు అహ్మదాబాద్‌లో పర్యావరణ అనుకూల మాస్ మొబిలిటీని ప్రోత్సహిస్తుంది అని తెలిపారు.

ఈ Ultra Urban e-bus లు అహ్మదాబాద్ నగరంలోని కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు, కొత్త విమానాశ్రయ మార్గానికి అనుగుణంగా ఉంటాయి. ఇది ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని, అహ్మదాబాద్ వాసుల‌కు జీరో-ఎమిషన్ మొబిలిటీని అందిస్తుంది.

ఈవీ మొబిలిటీలో టాటా

భారతదేశానికి పర్యావరణ అనుకూల వాహ‌నాల‌ను తీసుకురావడంలో టాటా మోటార్స్ ముందు వ‌రుస‌లో ఉంది. బ్యాటరీ-ఎలక్ట్రిక్, హైబ్రిడ్, CNG, LNG తోపాటు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో సహా ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతతో నడిచే భవిష్యత్ వాహనాలను రూపొందించడానికి నిత్యం ప‌రిశోధ‌న‌లు చేస్తోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు 15 హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సులను అందించడానికి టాటా మోటార్స్ కంపెనీ ఆర్డర్‌ను పొందింది. స్థిరమైన మొబిలిటీ ప్రమాణంగా మార్చే దిశగా పని చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు, టాటా మోటార్స్ భారతదేశంలోని అనేక నగరాల్లో 600 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసింది.

మరిన్ని అప్‌డేట్‌ల కోసం హ‌రిత‌మిత్ర సంద‌ర్శించండి ఈవీ వీడియోల కోసం మా Hartha mithra YouTube ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి!

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..