
- నాగర్‌కర్నూల్, వనపర్తి, ఖమ్మం, నల్గొండ, హనుమకొండ, పెద్దపల్లి జిల్లాల్లో కొత్త యార్డులు
- పంట కొనుగోలు, ధరల నిర్ధారణ, తూకం లావాదేవీలన్నీ పారదర్శకంగా నిర్వహణ
- రైతుల భద్రత, రవాణా ఖర్చుల తగ్గింపు, కోల్డ్ స్టోరేజ్, గిడ్డంగులు వంటి సదుపాయాలు
Hyderabad : తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో 10 కొత్త మార్కెట్ యార్డులు (New Market Yards) ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన తుది ఉత్తర్వులు జారీ చేయనుంది. దీంతో తెలంగాణలో మార్కెట్ యార్డుల సంఖ్య 197 నుంచి 207కి చేరుతుంది.
కొత్త మార్కెట్ యార్డులను నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు, అదే జిల్లాలోని పెద్దకొత్తపల్లి, పెద్దపల్లి జిల్లా ఎలిగేడు, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, వనపర్తి జిల్లా పానగల్, వీవనగండ్ల, ఖిలాఘ ర్, గోపాల్‌పేట, ఖమ్మం జిల్లా మత్కేపల్లి, నల్గొండ జిల్లా దామరచర్లలో వీటి ఏర్పాటుకు ఇప్ప టికే ప్రాథమిక, తుది నోటిఫికేషన్లను వ్యవసాయశాఖ అధికారులు జారీ చేశారు. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కానందున తాజాగా తుది ఉత్తర్వులను జారీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ 10 మార్కెట్ యార్డులు కాకుండా మరో ఐదు మార్కెట్ యార్డుల ఏర్పాటుకు సైతం ప్రభుత్వం ప్రతిపాదనలను పరిశీలిస్తోంది.
New Market Yards : కొత్త మార్కెట్ యార్డులు ఇవే..
- నాగర్‌కర్నూల్ జిల్లాలోని కోడేరు, పెద్దకొత్తపల్లి.
- వనపర్తి జిల్లాలోని పానగల్, వీవనగండ్ల, ఖిలాఘన్‌పూర్, గోపాల్‌పేట.
- పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడు.
- హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి.
- నల్గొండ జిల్లాలోని దామరచర్ల.
- ఖమ్మం జిల్లాలోని మత్కేపల్లి
కాగా, కొత్త మార్కెట్ యార్డుల ఏర్పాటుతో రైతులకు అనేక లాభాలు కలుగనున్నాయి. మార్కెట్ యార్డులు రైతులకు తమ పంటలను నేరుగా కొనుగోలుదారులకు విక్రయించుకోవచ్చు. దీని వల్ల దళారుల బెడద తగ్గిపోతుంది. తద్వారా రైతులు తమ ఉత్పత్తులకు ఆశించినంత ధరలు, ఎక్కువ లాభాలు పొందవచ్చు. యార్డులలో పోటీ వాతావరణం నెలకొని, రైతులకు మంచి రేట్లు లభిస్తాయి. మార్కెట్ యార్డుల్లో జరిగే లావాదేవీలన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉంటాయి. పంటల తూకం, నాణ్యత పరీక్షలు, ధరల నిర్ణయం వంటి ప్రక్రియలు పారదర్శకంగా జరుగుతాయి. దీనివల్ల మోసాలు, అన్యాయాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.