EV Sales

EV Sales | ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ‘వృద్ధి’కి బ్రేక్ లేదు – TVS, బజాజ్ దూసుకెళ్తున్నాయ్..!

Spread the love

EV Sales June 2025 | మొదట్లో ఓలా, ఏథ‌ర్ వంటి స్టార్టప్‌లు జోరుగా దూసుకెళ్లిన ఈవీ మార్కెట్‌లో ఇప్పుడు టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో లాంటి బ‌డా కంపెనీలు పగ్గాలు చేపట్టాయి. జూన్ 2025 విక్రయ గణాంకాలు పరిశీలిస్తే, TVS మోటార్ కంపెనీకి చెందిన iQube హ్యాట్రిక్ సాధించి, వరుసగా మూడు నెలలు భారతదేశంలోని అగ్రశ్రేణి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా నిలిచింది. బజాజ్ చేతక్ రెండో స్థానాన్ని కైవ‌సం చేసుకుంది. ఒక‌ప్పుడు ఈ సెగ్మెంట్ లీడర్‌గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ మూడవ స్థానంతో పోటీ పడాల్సి వచ్చింది.

టీవీఎస్ మోటార్ కంపెనీ

టీవీఎస్ ఏప్రిల్‌లో ద్విచక్ర వాహన ఎలక్ట్రిక్ విభాగంలో అగ్ర‌స్థానానికి చేరుకుంది.అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. దీని ఇ-స్కూటర్, ఐక్యూబ్ (TVS IQube) జూన్ 2025లో 25,274 యూనిట్లను నమోదు చేసి సంవత్సరం వారీగా 80% భారీ వృద్ధిని సాధించింది. టీవీఎస్ మోటార్ 24% మార్కెట్ వాటాతో ముందుంది. కంపెనీ ఐక్యూబ్ లైనప్‌ను పెద్ద 3.5 kWh బ్యాటరీతో అప్‌డేట్ చేయడం, 3.3 kWh బ్యాటరీని భర్తీ చేయడం, ధరను దాదాపు రూ. 8,000 తగ్గించడంతో అమ్మకాలను మరింతగా పెరిగాయి. కొత్త ఐక్యూబ్ వేరియంట్‌లు 5.9 bhp, 140 Nm పీక్ టార్క్ ఉత్పత్తిని కలిగి ఉంటాయి. 3 గంటల్లో 0% నుండి 80% వరకు ఛార్జ్ చేస్తాయి.

బజాజ్ ఆటో

బజాజ్ ఆటో (Bajaj Auto) 23,004 యూనిట్లను విక్రయించి తన రెండవ స్థానాన్ని నిలుపుకుంది. ఇది సంవత్సరానికి 154% అధికం. మరింత ఎన‌ర్జీ, రేంజ్, స్టోరేజ్ కెపాసిటీతో బజాజ్ తన సెకండ్‌ జ‌న‌రేష‌న్‌ చేతక్‌ను ప్రారంభించడంలో బిజీగా ఉంది. ఇటీవల, కంపెనీ తన ఎంట్రీ-లెవల్ వేరియంట్‌ను చేతక్ 3001తో అప్‌డేట్ చేసింది. దీని ధర రూ. 99,900, ఎక్స్-షోరూమ్. ఇది చిన్న పట్టణాల్లో కంపెనీ తన పరిధిని విస్త‌రించ‌డానికి మరింత సహాయపడింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే TVS, బజాజ్ రెండూ కలిసి దాదాపు 46% మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి.

ఓలా ఎలక్ట్రిక్

కొన్ని నెల‌ల క్రితం ఓ ఊపు ఊపిన ఈవీ వాహనాలు పడిపోయాయి. ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) 20,189 యూనిట్లను విక్రయించి, సంవత్సరానికి 45% తగ్గుదల నమోదు చేసింది. టీవీఎస్, బజాజ్ మాదిరిగా కాకుండా, ఓలా నెలకు 9% వృద్ధిని నమోదు చేయడం పట్ల సంతోషించాల్సిన విషయం. బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ మార్కెట్ వాటా 46% నుంచి దాదాపు 19%కి పడిపోయింది.

అథర్ ఎనర్జీ, హీరో విడా

జూన్ నెలలో ఏథర్ ఎనర్జీ 14,512 యూనిట్లను సాధించి స్థిరమైన వృద్ధిని సాధించింది, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 133% వృద్ధిని నమోదు చేసింది. దీని మార్కెట్ వాటా 7.8% నుండి 13.8%కి పెరిగింది.

హీరో మోటోకార్ప్ మార్కెట్ వాటా 7.3%, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 149% భారీ పెరుగుదల (EV Sales ) న‌మోదుచేసుకుంది. జూన్ నెలలో కంపెనీ 7,664 యూనిట్లను విక్రయించింది. హీరో ఇటీవలే రూ. 59,490 ధరకు సరసమైన విడా VX2ను విడుదల చేయడంతో తన మార్కెట్ వాటాను మరింత పెంచుకునే అవకాశం ఉంది, ఇది సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో వస్తుంది.

EV Sales : ముఖ్య గణాంకాలు – జూన్ 2025

కంపెనీఅమ్మకాలు (యూనిట్లు)YoY వృద్ధిమార్కెట్ వాటా
TVS iQube25,27480% ↑24%
Bajaj Chetak23,004154% ↑~22%
Ola Electric20,18945% ↓~19%
Ather Energy14,512133% ↑13.8%
Hero VIDA7,664149% ↑7.3%

హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోండి..

More From Author

Vida VX2 3

రూ.59వేలకే కొత్త హీరో Vida VX2 ఈవీ స్కూటర్.. సబ్‌స్క్రిప్షన్ మోడల్‌తో సెన్సేషన్

AI Agriculture

రైతులకు శాటిలైట్ ఆధారిత ఏఐ టెక్నాలజీ – ముందస్తు హెచ్చరికలతో అధిక దిగుబడి – AI in Agriculture

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest

Indie Electric Scooter : భార‌తీయ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌కు అంతర్జాతీయ గౌరవం

రివర్ మొబిలిటీ ‘ఇండీ’ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రెడ్ డాట్ డిజైన్ అవార్డు 2025 Indie Electric Scooter : రివర్ మొబిలిటీ తన ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం రెడ్ డాట్ ప్రొడక్ట్ డిజైన్ అవార్డు 2025ను అందుకుంది, 2024లో రెడ్ డాట్ డిజైన్ కాన్సెప్ట్ అవార్డుకు సైతం రివర్​ మొబిలిటీ కైవసం చేసుకుంది. ఈ...