
EV Sales | ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ‘వృద్ధి’కి బ్రేక్ లేదు – TVS, బజాజ్ దూసుకెళ్తున్నాయ్..!
EV Sales June 2025 | మొదట్లో ఓలా, ఏథర్ వంటి స్టార్టప్‌లు జోరుగా దూసుకెళ్లిన ఈవీ మార్కెట్‌లో ఇప్పుడు టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో లాంటి బడా కంపెనీలు పగ్గాలు చేపట్టాయి. జూన్ 2025 విక్రయ గణాంకాలు పరిశీలిస్తే, TVS మోటార్ కంపెనీకి చెందిన iQube హ్యాట్రిక్ సాధించి, వరుసగా మూడు నెలలు భారతదేశంలోని అగ్రశ్రేణి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా నిలిచింది. బజాజ్ చేతక్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఒకప్పుడు ఈ సెగ్మెంట్ లీడర్‌గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ మూడవ స్థానంతో పోటీ పడాల్సి వచ్చింది.టీవీఎస్ మోటార్ కంపెనీటీవీఎస్ ఏప్రిల్‌లో ద్విచక్ర వాహన ఎలక్ట్రిక్ విభాగంలో అగ్రస్థానానికి చేరుకుంది.అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. దీని ఇ-స్కూటర్, ఐక్యూబ్ (TVS IQube) జూన్ 2025లో 25,274 యూనిట్లను నమోదు చేసి సంవత్సరం వారీగా 80% భారీ వృద్ధిని సాధించింది. టీవీఎస్ మోటార్ 24% మార్కెట్ వాటాతో ముందుంది. కంపెనీ ఐక్యూ...