TVS Orbiter | ₹99,990 ధరలో TVS కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ “ఆర్బిటర్”

TVS Orbiter | భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ ఊపందుకుంది. బడా కంపెనీలు వరుసగా అన్నివర్గాల కొనుగోలుదారులను ఆకర్షించేలా అనేక మోడళ్లను విడుదల చేస్తున్నాయి. మార్కెట్లో తాజాగా టీవీఎస్ ఆర్బిటర్ వచ్చేసింది. ఇది యువ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకున్న ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,990. టీవీఎస్ కంపెనీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఇప్పుడు 3 మోడల్స్, అనేక వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

కొత్త టీవీఎస్ ఆర్బిటర్ టాప్ మూడు ముఖ్యాంశాలు
TVS Orbiter : డిజైన్
కొత్త టీవీఎస్ ఆర్బిటర్ డిజైన్ విషయానికి వస్తే కాస్త స్పోర్టీ డిజైన్ ను కలిగి ఉంది. ఆర్బిటర్‌లో ఇరుకైన ఫ్రంట్ ఆప్రాన్‌తో కూడిన ఫ్రంట్ డిజైన్ ఉంటుంది, DRL ముందు భాగంలో కొత్త జూపిటర్ ను పోలి ఉంది. ఇక హెడ్‌లైట్ ఐక్యూబ్ లో మాదిరిగా కాకుండా భిన్నంగా హ్యాండిల్‌బార్‌లపై అమర్చబడి ఉంది.
ఆర్బిటర్‌లో పొడవైన సీటు, ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్, చతురస్త్రాకారపు మిర్రర్స్, ఇంటిగ్రేటెడ్ బ్లింకర్లు, చిన్న విండ్‌స్క్రీన్ ఉంటాయి. ఈ చిన్నచిన్న మార్పులు ఆర్బిటర్ ను iQube, టీవీఎస్ X నుండి వేరు చేస్తాయి. కొత్త మార్పులు దీనికి స్వంత గుర్తింపును ఇస్తాయి. అలాగే, ఆర్బిటర్ ఆరు రంగుల ఎంపికలలో లభిస్తుంది: నియాన్ సన్‌బర్స్ట్, స్ట్రాటోస్ బ్లూ, లూనార్ గ్రే, స్టెల్లార్ సిల్వర్, కాస్మిక్ టైటానియం, మార్టిన్ కాపర్.

TVS Orbiter : ఫీచర్లు
ఆర్బిటర్ EV ఫోన్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. ఇది దానితో పాటు నావిగేషన్‌ను పొందుతుంది. క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ ఫంక్షన్, రివర్స్ పార్కింగ్ అసిస్ట్ వంటి ఇతర ముఖ్యమైన ఫీచర్లను కూడా కలిగి ఉంది.
TVS ఆర్బిటర్‌లో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో డ్యూయల్ షాక్‌లు, రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లు, LED లైటింగ్, 14-అంగుళాల ముందు చక్రం, 12-అంగుళాల వెనుక చక్రం ఉన్నాయి. స్కూటర్ సీటు కింద 34 లీటర్ల స్టోరేజ్ కలిగి ఉంది. ఇది రెండు హాఫ్ హెల్మెట్‌లను తీసుకెళ్లగలదు.

TVS ఆర్బిటర్: బ్యాటరీ స్పెసిఫికేషన్లు
వివిధ బ్యాటరీ సైజులతో అందించబడే TVS iQube మాదిరిగా కాకుండా, TVS ఆర్బిటర్ ఒకే ఒక బ్యాటరీ వేరియంట్ ను తీసుకొచ్చింది. ఇందులో 3.1kWh బ్యాటరీ ప్యాక్ ను అమర్చారు. TVS పూర్తి ఛార్జ్ పై 158 కిలోమీటర్ల IDC పరిధిని క్లెయిమ్ చేస్తుంది. ఇది గంటకు 68 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులోని బ్యాటరీని నాలుగు గంటల్లో 0 నుంచి 80 వరకు చార్జ్ చేయవచ్చు.
TVS Orbiter | Specifications |
Max Power | 2.5 kW |
Top Speed | 68 kmph |
Transmission | Automatic |
Riding Range | 158 IDC |
Battery | 3.1 kWh |
Riding Modes | Eco and City |
Ex-showroom price | Rs 99,990 |
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
One thought on “TVS Orbiter | ₹99,990 ధరలో TVS కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ “ఆర్బిటర్””