Sunday, December 22Lend a hand to save the Planet
Shadow

ప్ర‌పంచంలోనే అత్య‌ధిక రేంజ్‌తో Simple One electric scooter

Spread the love

simple one electric scooter

దేశ స్వాంత్ర్య దినోత్స‌వం రోజున వాహ‌న రంగంలో రెండు అద్భుత ఆవిష్క‌ర‌ణ‌లు జ‌రిగాయి.  అందులో ఒక‌టి ఓలా ఎల‌క్ట్రిక్ సంస్థ ఓలా ఎస్‌1, ఓలా ఎస్ 1 ప్రో ఈ-స్కూట‌ర్ల‌ను విడుద‌ల చేయ‌గా..  సింపుల్ ఎన‌ర్జీ కంపెనీ Simple One electric scooter ను లాంచ్ చేసింది.  ఈ రెండు స్కూట‌ర్‌లు అంచ‌నాల‌కు మించి అత్యాధునిక ఫీచ‌ర్ల‌తో ముందుకు వ‌చ్చాయి.  టాప్ స్పీడ్‌, రేంజ్ విష‌యంలో ఓలా కంటే సింపుల్ వ‌న్ స్కూట‌ర్ పైచేయి సాధించింది.

బెంగళూరుకు చెందిన EV స్టార్టప్ సింపుల్ ఎనర్జీ త‌న మొట్టమొదటి ప్రోడ‌క్ట్ అయిన Simple One electric scooter ను ఆగ‌స్టు 15న ప్రారంభించింది.  దీని ధర రూ .1,09,999 (ఎక్స్-షోరూమ్, FAME II సబ్సిడీకి ముందు).  ఎలక్ట్రిక్ స్కూటర్ వ‌చ్చే రెండు నెలల్లో 13 రాష్ట్రాల్లోని 75 నగరాల్లో అందుబాటులో ఉంటుందని సింపుల్ ఎన‌ర్జీ సంస్థ పేర్కొంది.
ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో ఈ స్కూట‌ర్ రేంజ్ ఇప్ప‌టిర‌కు అత్య‌ధికం.  సింపుల్ వ‌న్ స్కూట‌ర్ సింగిల్ ఛార్జ్‌పై 236 కిమీ వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. ఈ రేంజ్ అనేది దాని మోడ్ ను బ‌ట్టి మారుతుంది.  ఇది గంటకు 105 కి.మీ వేగంతో దూసుకుపోతోంది.

4.8 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ, 4.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది.  ఇది రిమూవబుల్ బ్యాటరీ. దీనిని సులభంగా బైక్ నుంచి విడ‌దీసి ఛార్జ్ చేసుకోవచ్చు.  స్కూట‌ర్ నుంచి విడ‌దీసి చార్జి పెట్టుకోవ‌చ్చు.  ఈ బ్యాట‌రీ కేవలం 7 కిలోల బరువు మాత్ర‌మే ఉంటుంది. దీనిని ఈజీగా కారీ చేయ‌వ‌చ్చు.

ఎకో మోడ్‌లో 203 కిమీ. అలాగే ఐడిల్ ‘ పరిస్థితుల్లో 236 కిమీ రేంజ్ ఇస్తుంద‌ని కంపెనీ హామీ ఇచ్చింది. Simple One electric scooter కోసం కంపెనీ ఇటీవ‌లే సింపుల్ లూప్ చార్జ‌ర్‌ను ఆవిష్క‌రించింది.  దీని సహాయంతో కేవలం 60 సెకన్లలో 2.5 కిమీ రేంజ్ వరకు ఛార్జ్ చేయ‌వ‌చ్చు.  కాగా ఇది హోమ్ ఛార్జర్ ద్వారా 2.75 గంటల్లో 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేస్తుంది.

3సెక‌న్ల‌లోనే 40కిలోమీట‌ర్ల వేగం

0-50 km/h స్ప్రింట్ సమయం 3.6 సెకన్లు. 0 నుంచి 40 km/h 2.95 సెకన్లు.
ప్ర‌స్తుతం Simple One electric scooter నాలుగు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.  అవి రెడ్(Namma Red), గ్రేస్ వైట్, అజూర్ బ్లూ తోపాటు బ్రెజెన్ బ్లాక్. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ నాలుగు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది.  అవి ఎకో, రైడ్, డాష్ మరియు సోనిక్ మోడ్స్.

dashboard

టచ్‌స్క్రీన్ పై పూర్తి స‌మాచారం

ఇందులోని TFT టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ డాష్‌బోర్డ్ ఎన్నో స్మార్ట్ ఫీచర్లు క‌లిగి ఉంది.  ప్రయాణంలో నావిగేషన్, బ్లూటూత్, 4G కనెక్టివిటీ, జియో-ఫెన్సింగ్, OTA అప్‌డేట్స్, రిమోట్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి.  టెలిమెట్రీ, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), వెహికల్ ట్రాకింగ్, వెకేషన్ మోడ్ ఉంటాయి.  అలాగే మీకు సమీప ఫాస్ట్ ఛార్జర్ లొకేషన్ గురించిన‌ వివరాలను కూడా అందిస్తుంది.

కాంబీ బ్రేకింగ్ సిస్టం

ముందు వైపు 200 మిమీ డిస్క్ బ్రేక్‌, వెనుకవైపు 190 మిమీ డిస్క్ బ్రేక్‌ ఉంటుంది.  ఇక సస్పెన్షన్ విష‌యానికొస్తే ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్. వెనుక వైపు మోనోషాక్ ఉంటుంది.  Simple One electric scooter ను నిమిషానికి 2.5 కిమీ చొప్పున ఛార్జ్ చేయవచ్చు. ఇ-స్కూటర్ మొదటి దశలో 13 రాష్ట్రాల్లో లాంచ్ చేస్తారు.  ఆ తరువాత మరిన్ని నగరాలకు విస్త‌రిస్తారు.  మొదటి దశ రాష్ట్రాలలో తెలంగాణ తోపాటు ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, గోవా, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ మరియు పంజాబ్ ఉన్నాయి.

300+ ఛార్జింగ్ స్టేషన్లు

సింపుల్ ఎనర్జీ పైన పేర్కొన్న రాష్ట్రాల నగరాల్లో కంపెనీ యాజమాన్యంలోని ఎక్స్‌పీరియ‌న్స్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయ‌నుంది.  తద్వారా త్వరలో డెలివరీలను ప్రారంభించనుంది.  సింపుల్ ఎనర్జీ ఇప్పుడు మూడున్నరేళ్ల కంపెనీ. బ్రాండ్ ప్రస్తుతం 70+ స‌ప్ల‌య‌ర్స్ పాటు 120 మంది వెండ‌ర్స్‌ను కలిగి ఉంది.  సింపుల్ ఎన‌ర్జీ పరిశ్రమ 4.0 ఫ్యాక్టరీలో ఏడాదికి 10 లక్షల యూనిట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది.  రాబోయే మూడు నాలుగు నెలల్లో 300+ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయ‌నున్నామ‌ని సింపుల్ ఎనర్జీ తెలిపింది. ఇక్కడ వినియోగదారులు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చేసుకోవ‌చ్చు. ఈ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి కంపెనీ షాపింగ్ కాంప్లెక్స్‌లు, రెస్టారెంట్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

రూ.1,947తో బుకింగ్స్

సింపుల్ ఎనర్జీ తన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ.1.09 లక్షలు. ఈ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభించబడ్డాయి.  కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ.1,947 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు.  ఈ స్కూటర్ డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

simple energy

డిజైన్ విషయానికి వస్తే, ఇది ట్ర‌యాంగిల్ ఎల్ఈడీ డీర్ఎల్ లు, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌, టర్న్ ఇండికేట‌ర్స్ ఉంటాయి. ఎల్ఈడీ టెయిల్-లాంప్, సింగిల్-పీస్ సీట్, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్ ఉంటుంది. Simple One electric scooter లో30 లీటర్స్ అండర్-సీట్ స్టోరేజ్ ఉంది.

ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 236కిమీ వెళ్ల‌వ‌చ్చు.

ఈ స్కూటర్ కేవలం 3.6 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 100 కిమీ వరకు ఉంటుంది.  ఇది ఎకో మోడ్‌లో 203 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్ర‌స్తుతం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌, ఏథ‌ర్ 450ఎక్స్ స్కూట‌ర్ల‌కు గ‌ట్టిపోటీ ఇవ్వ‌నుంది.

 

4 Comments

  • SABAVAT NAGARAJU NAIK

    Please provide Petrol cum electric Bike with fast charging and long distance travelling with one charge. It will helpful to all customers if their battery is nill. Every one can turns this side only when they find this option. Why because every time charging is impossible in some situation.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *