Home » ఏథ‌ర్ ఎన‌ర్జీ.. fast-charging Stations…

ఏథ‌ర్ ఎన‌ర్జీ.. fast-charging Stations…

Hero MotoCorp charging stations
Spread the love

ప్రారంభించ‌నున్న‌ ఏథర్ ఎనర్జీ

athar enrgy charging stations

ఏథర్ ఎనర్జీ సంస్థ తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతోపాటు ఇత‌ర కంపెనీల ఈవీల కోసం Charging stations ప్రారంభిస్తోంది.  ప్ర‌స్తుతం ఉన్న ఏథర్ ఎనర్జీ 200+ ఫాస్ట్ ఛార్జర్‌లను ఇత‌ర కంపెనీల ఈవీలు కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు.  అది కూడా ఉచితంగా. ఫ‌లితంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు వాడేవ‌రు ఇక చార్జింగ్‌పై ఆందోళ‌న చెంద‌న‌వ‌స‌రం లేదు.  దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పెరుగుదలకు ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రధాన సమస్యగా ఉంది.  ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తృతి, సామర్థ్యాన్ని పెంచడానికి మ‌రిన్ని Charging stations ను ఏర్పాటు చేయాల్సి ఉంది.

ఏథర్ ఎనర్జీ సంస్థ తన ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ గ్రిడ్‌ను రంభించింది.  ఇది అన్నిర‌కాల కంపెనీల‌కు చెందిన‌ ఎలక్ట్రిక్ టూవీలర్‌లు, నాలుగు చక్రాల వాహనాలకు కోసం సాధారణ స్పీడ్ ఛార్జ్ ఎంపికలను ఉచితంగా అందిస్తోంది.  దేశవ్యాప్తంగా ఏథర్ ఎనర్జీ త‌న‌ కనెక్టర్ టెక్నాలజీని ప్రారంభించ‌డం ద్వారా వేగవంత‌మైన ఛార్జింగ్ పరిష్కారం ల‌భించిన‌ట్ల‌యింది.

ఏథర్ రూపొందించిన ఈ కనెక్టర్‌లో ఒకే కనెక్టర్‌తో కాంబో AC మరియు DC ఛార్జింగ్ ఉన్నాయి.  ఇది CAN 2.0 కమ్యూనికేషన్ సామర్థ్యంతో ద్విచక్ర వాహనాలు మరియు మూడు చక్రాల వాహనాలలో క‌నెక్ట్ చేయడానికి అనుకూలంగా రూపొందించబడింది.  ఇది మాస్ సెగ్మెంట్ వాహనాలలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది.

ఏథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు & సీఈఓ తరుణ్ మెహతా మాట్లాడుతూ, “ఎలక్ట్రిక్ టూవీలర్స్ ఇప్పుడు ఫేమ్ 2 ద్వారా ప్రభుత్వ ప్రోత్సాహంతో మార్కెట్‌లోకి వ‌స్తృతంగా వ‌స్తున్నాయి. వినియోగదారులకు పబ్లిక్ ప్రదేశాలలో వేగవంతమైన ఛార్జింగ్ నెట్‌వర్క్ అవసరం. మా Charging stations క‌నెక్ట‌ర్‌ను ఇత‌ర వాహ‌నాలు కూడా ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *