సరికొత్త స్టైల్‌లో Quanta electric bike

Quanta electric bike
Gravton మోటార్స్ సంస్థ సరికొత్త స్టైల్‌లో Quanta electric bike ను ప్రారంభించింది. ఇది సింగిల్ చార్జిపై 120 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ప్రస్తుతానికి గ్రావ్టన్ క్వాంట హైదరాబాద్‌లో అందుబాటులో ఉంది. ఈ బైక్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
గ్రావ్టన్ మోటార్స్ అనే సంస్థ 2016లోనే స్థాపించబడింది. ఐదేళ్ల తర్వాత ప్రస్తుతం సరికొత్త రూపంలో ఉన్న మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేయగలిగారు. అయితే ఇది వాహనం ఒక స్కూటర్, బైక్ మరియు మోపెడ్ లక్షణాలను కలిగి ఉంది. ఇది పూర్తిగా తెలంగాణలొనే రూపొందించబడిందని గ్రావ్టన్ మోటార్స్ సీఈఓ పరశురాం పాకా తెలిపారు. ప్రస్తుతానికి గ్రావ్టన్ క్వాంట హైదరాబాద్‌లో అందుబాటులో ఉంది.
గంటకు 70కి.మి వేగం
Quanta electric bike లో లి-అయాన్ బ్యాటరీని వినియోగించారు. బ్యాటరీ 3kWh సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది 170Nm టార్క్ ను జనరేట్ చేస్తుంది. బైక్ యొక్క టాప్ స్పీడ్ 70 కిలోమీటర్లు . ఇందులో ఎకో, సిటీ మరియు స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. మొదటి రెండు మోడ్‌లలో తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. చివరి స్పోర్ట్స్ మోడ్‌లో EV యొక్క అత్యధిక స్పీడ్‌ను అందిస్తుంది. కాగా 2,500 బైక్‌లు అమ్ముడైన తర్వాత బ్యాటరీ మార్పిడి స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఫ్యాక్టరీలో నెలకు 2,000 యూనిట్లను తయారు చేసే సామర్థ్యం ఉంది.
బ్లూటూత్ కనెక్టివిటీ
డిజిటల్ ఎల్ఈడి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది మరియు ఇది బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. మొబైల్ యాప్‌తో కనెక్ట్ చేయవచ్చు. వాహనానికి సంబంధించిన వివరాలను ఆ యాప్‌లో గమనించవచ్చు. గ్రావ్టన్ మోటార్స్ బైక్‌తో పాటు బ్యాటరీపై మూడేళ్ల వారంటీని అందిస్తుంది. బైక్ వెనుక వైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు అలాగే డ్యూయల్ సైడెడ్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. ఈ బైక్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ electric bike ధర రూ .99,000 ఉండొచ్చని అంచనా.
test
Veracity bike
💐💐👍👍