ఇండియాలో తయారైన తొలి భారీ ఎలక్ట్రిక్ ట్రక్ rhino 5536
కిలోమీటర్ ప్రయాణానికి కేవలం రూ.పదే..
గుర్గావ్‌కు చెందిన ఇన్‌ఫ్రాప్రైమ్ లాజిస్టిక్స్ టెక్నాలజీస్ (ఐపిఎల్‌టి) సంస్థ రూపొందించిన భారీ ట్రక్ rhino 5536 ఎన్నోవిశేషాలను కలిగి ఉంది. అత్యంత శక్తివంతమైన ఈ రినో 5536 ట్రక్ మన ఇండియాలోనే రూపుదిద్దుకుంది. రినో ట్రక్ 60 టన్నుల బరువు ఉంటుంది. పవర్‌ఫుల్ బ్యాటరీతో పరుగులు పెడుతుంది. ఇందులో 483 బిహెచ్‌పి ఉత్పత్తిని కలిగి ఉన్న ఎలక్ట్రిక్ మోటారును వినియోగించారు. అలాగే 276 కిలోవాట్ల బ్యాటరీని కలిగి ఉంది.
అత్యాధునిక ఫీచర్లు.
సింగిల్ చార్జిపై 200-300 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. ఫుల్‌లోడ్‌తో సుమారు 300కిలోమీటర్లు, లోడ్ లేకుండా సుమారు 400కిలోమీటర్లు వెళ్తుంది.
16కేవీ ఫాస్ట్ చార్జర్ సాయంతో ఈ వాహనం బ్యాటరీని కేవలం గంటలోనే ఫుల్ చార్జ్ చేయవచ్చు. బ్యాటరీ ఉష్ణోగ్రత పెరగకుండా ప్రత్యేక కూలింగ్ సిస్టంను ఇందులో పొందుపరిచారు. ఇక ఈ ట్రక్ గరిష్ట వేగం గంటకు 90 కి.మీ. కిలోమీటర్ ప్రయాణానికి కేవలం రూ.10 మాత్రమే ఖర్చవుతుంది. అదే డీజిల్ ట్రక్ అయితే సుమారు రూ.30 అవుతుంది. వాహనం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. సిమెంట్ కంపెనీలు, మైనింగ్ ,కంస్ట్రక్షన్ కంపెనీలో సామాగ్రిని రవాణా చేయడానికి అనువుగా ఈ rhino 5536ను రూపొందించారు.
ఈ ఎలక్ట్రిక్ ట్రక్కుల ఉత్పత్తి 2020 జనవరి నుండి కంపెనీ ఫరీదాబాద్ ప్లాంట్లో ప్రారంభమైంది. 2021 నాటికి 10,000 ట్రక్కులను రోడ్డుపైకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్‌ఫ్రాప్రైమ్ లాజిస్టిక్స్ టెక్నాలజీస్ (ఐపిఎల్‌టి) సంస్థ తన AI- ఎనేబుల్డ్ ఆర్డర్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ ‘ట్రక్ నౌ’ అలాగే డ్రైవర్ హెల్ప్ యాప్ ‘హమ్‌సఫర్’ ట్రక్ ప్లేస్‌మెంట్ , ఫ్లీట్ ఆపరేటర్లకు ఛార్జింగ్ స్లాట్ లభ్యతకు కంపెనీ భరోసా ఇస్తోంది.
రినో 5536 ఎలక్ట్రిక్ ట్రక్ విశేషాలు
- టాప్ స్పీడ్ – 90 km/h
- సింగిల్ చార్జిపై – 400 Km ప్రయాణం
- బ్యాటరీ సామర్థ్యం 276 kWh
- ట్రక్ బరువు – 60 Ton
- మోటార్ పవర్ ఔట్‌పుట్ – 483 bhp
- లాంచ్ ఇయర్ – 2020.
👌👌👌