ఆగస్టు 25న ఎలక్ట్రిక్ బైక్ లాంచ్
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు సింపుల్ ఎనర్జీ వన్ electric scooters లాంచ్ అయిన తర్వాత, ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ మొబిలిటీ సంస్థ eBikeGo bike (ఈ బైక్ గో) ఈనెల 25న సరికొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ బైక్ ప్రారంభించిన తర్వాత మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చింది. అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్‌కు సంబంధించిన వివరాలేవీ eBikeGo వెల్లడించలేదు. హై-స్పీడ్ ‘ఎలక్ట్రిక్ బైక్’ అని పేర్కొంది. ఇది గంటకు 45 కిమీ కంటే ఎక్కువ వేగం ఉంటుదని మనం ఆశించవచ్చు. మరో మంచి విషయమేమంటే ఇది కేంద్ర ప్రభుత్వం అందించే ఫేమ్-II సబ్సిడీకి ఈ బైక్‌కు వర్తిస్తుంది.
eBikeGo bike ఇండియాలోనే తయారీ
రగ్డ్ ఎలక్ట్రిక్ బైక్ పూర్తిగా భారతదేశంలోనే డిజైన్ చేసి తయారు చేయబడిందని కంపెనీ ప్రకటించింది. దీనిని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) కూడా పరీక్షించి ఆమోదించింది. ఇది 25 ఆగస్టు 2021 న విడుదల చేయనున్నారు. పరిమిత ప్రీ-ఆర్డర్ ఆప్షన్‌ను ఈబైక్‌గో వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఈబైక్‌గో తన ఆల్-ఎలక్ట్రిక్ డెలివరీ నెట్‌వర్క్‌ను 2017 లో ప్రారంభించించింది. అప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ టూవీలర్ OEM లు, తయారీదారులు పెరిగే అవకాశముంటుందని కంపెనీ అంచనా వేసింది. అప్పటి నుంచే ఇది ఈవీల తయారీపై దృష్టి కేంద్రీకరించింది. దీని ధర కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుదని కంపెనీ పేర్కొన్నారు.
eBikeGo వ్యవస్థాపకుడు & CEO ఇర్ఫాన్ ఖాన్ మాట్లాడుతూ.. భారతదేశంలో అత్యంత స్థిరమైన, తెలివైన. బలమైన ఎలక్ట్రిక్ మోటార్-స్కూటర్ ‘రగ్డ్’ ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇది భారతదేశంలో ఇ-మొబిలిటీమొబిలిటీ దిశను మార్చివేస్తుందని, ఎలక్ట్రిక్ బైక్ విభాగంలో ఆవిష్కరణ సరిహద్దులను దాటుతుందని అన్నారు.
👏👏