ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని గురుద్వారా జంక్షన్‌లో నిర్మించిన ఓ ప్రత్యేకమైన హోటల్ (Smart Solar Hotel )అందనినీ ఆకర్షిస్తుంది. హోటల్ భవనాన్ని కప్పేస్తూ ఏర్పాటు చేసిన అద్దాలు ఈ భవనానికి ప్రత్యేక అందాన్నితీసుకొచ్చాయి. ఈ సౌరకాంతితో మెరిసిపోతున్న ఈ అద్దాలు ఆకర్షణీయంగా కనిపించడమే కాదు. విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేస్తాయి. ఈ సోలార్ ప్యానెల్స్‌తో ఈ హోటల్‌కు బయటి నుంచి కరెంట్ సరఫరా అవసరం లేదు. అంతేకాకుండా ఇక్కడ ఉత్పత్తయిన మిగులు విద్యుత్‌ను పవర్‌గ్రిడ్‌కు విక్రయిస్తున్నారు.
నారాయణరావు అలియాస్ బాబ్జీ ఈ సోలార్ హోటల్‌ను నిర్మించారు. ‘నమో ఇన్‌స్పైర్ ది స్మార్ట్ ఐఎన్‌ఎన్’ పేరుతో ఐదు అంతస్తుల భవనంలో 250 సోలార్ ప్యానెల్స్‌ను అమర్చారు. నారాయణరావు చెప్పిన దాని ప్రకారం భవనానికి ప్యానెళ్లను బిగించేందుకు రూ. 15 లక్షలు ఖర్చయింది.
Smart Solar Hotel లో సౌర ఫలకాల ద్వారా సగటున 100 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఇక్కడ భవనం రోజుకు 40 కిలోవాట్ల నుండి 50 కిలోవాట్ల వరకు విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. మిగులు విద్యుత్‌ను పవర్ గ్రిడ్‌కు విక్రయిస్తున్నారు.
సోలార్ ప్యానెళ్లపై పెట్టిన పెట్టుబడి ఐదేళ్లలోపు వస్తుందని నారాయణరావు తెలిపారు. పర్యావరణ అనుకూలమైన పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకోవడంలో తాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి స్ఫూర్తి పొందానని పేర్కొన్నారు.
పర్యావరణాన్ని కాపాడేందుకే సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశానని చెప్పారు. అయితే నారాయణరావు సూచన మేరకు ఇతర వాణిజ్య సంస్థల యజమానులు తమ భవనాలకు సోలార్ ప్యానెల్స్ బిగించుకోవడం ప్రారంభిస్తే సంప్రదాయ ఇంధనాన్ని ఆదా చేయడం సులువవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా విద్యుత్ ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన ఈ సోలార్ ప్యానల్స్ చాలా దూరం నుంచి కూడా మెరుస్తూ ఆకర్షనీయంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ భవనం చూపరులను కట్టిపడేస్తోంది.
Wonderful
Great idea
[…] సోలార్ ప్రాజెక్ట్‌ను 40 బ్లాక్‌లుగా విభజించారు. […]