అబ్బురపరిచే విశేషాలు తీని సొంతం
పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఏర్పాటు
largest floating solar power plant : భారతదేశంలోనే యొక్క అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్ (ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్) ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంజనీరింగ్ తయారీ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (BHEL).. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న రామగుండం రిజర్వాయర్‌లో దీనిని నిర్మించింది. 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు రామగుండం రిజర్వాయర్‌లో 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని కోసం రూ.423 కోట్లు వెచ్చించారు.
ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ (తేలియాడే సోలార్ ప్లాంట్)ను “ఫ్లోటింగ్ సోలార్”, “ఫ్లోటింగ్ ఫోటోవోల్టాయిక్స్” (FPV) లేదా “ఫ్లోటోవోల్టాయిక్స్” అని కూడా పిలుస్తారు. ఇవి సాధారణంగా చెరువులు, సరస్సులు లేదా రిజర్వాయర్‌ల వంటి నీటి వనరులపై నిర్మించబడతాయి.
ప్రయోజనాలు అనేకం
- ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌లకు భూమి అవసరం లేదు.. కాబట్టి సాధారణ ప్లాంట్‌లతో పోలిస్తే త్వరగా నిర్మించవచ్చు.
- సాధారణ సోలార్ ప్లాంట్ల మాదిరిగానే అవి కూడా పెద్దగా శబ్దం చేయవు.
- రిజర్వాయర్‌లోని నీరు ఈ సౌర ప్లాంట్‌లకు కావలసిన పరిసర ఉష్ణోగ్రతను అందించడానికి దోహదపడుతుంది. ఫలితంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ను మెరుగుపరుస్తుంది. అయితే అవి సాధారణ ప్లాంట్ల నిర్మాణం కంటే కొంచెం ఖరీదైనవి.
రామగుండం రిజర్వాయర్‌లో 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టును రూ.423 కోట్లతో నిర్మించారు. విద్యుత్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన ప్రకారం.. ఈ 100-MW ప్రాజెక్ట్ అధునాతన సాంకేతికతతోకూడిన, పర్యావరణ అనుకూలమైనది. AEPC (ఇంజనీరింగ్, సేకరణ మరియు నిర్మాణం) ఒప్పందం కింద BHEL సంస్థ దీనిని నిర్మించబడింది.
రామగుండం వద్ద 100 మెగావాట్ల రామగుండం ఫ్లోటింగ్ సోలార్ పివి ప్రాజెక్ట్‌లో 20 మెగావాట్ల తుది భాగం కమర్షియల్ ఆపరేషన్‌ను 2022 జూలై 1 నుండి NTPC ప్రారంభించింది. వినూత్నంగా రూపొందించిన లేఅవుట్‌లు, లార్ మాడ్యూల్స్, ఎలక్ట్రికల్స్, ఫ్లోటర్‌లు ఉన్నాయి.
దేశీయంగానే తయారీ..
సోలార్ ప్లాంట్ యొక్క అన్ని ప్రధాన భాగాలు.. అనగా సోలార్ PV మాడ్యూల్స్, ఫ్లోటర్స్, బయో-డిగ్రేడబుల్ నేచురల్ ఈస్టర్ ఆయిల్‌తో నిండిన ఇన్వర్టర్-డ్యూటీ ట్రాన్స్‌ఫార్మర్లు, స్విచ్ గేర్, SCADA, కేబుల్స్ పూర్తిగా దేశీయంగా తయారుచేసినవే.. ఇవి భారత ప్రభుత్వం అనుసరిస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ మిషన్‌కు ఊతమిస్తున్నాయి.
ఇన్వర్టర్, ట్రాన్స్‌ఫార్మర్, హెచ్‌టి ప్యానెల్, స్కాడా SCADA (పర్యవేక్షక నియంత్రణ మరియు డేటా సేకరణ)తో సహా అన్ని ఎలక్ట్రికల్ పరికరాలు కూడా ఫ్లోటింగ్ ఫెర్రో సిమెంట్ ప్లాట్‌ఫారమ్‌లపై ఉండటం.. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత.
ఇది ఎలా పని చేస్తుంది?
ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్‌ను 40 బ్లాక్‌లుగా విభజించారు. ఒక్కొక్కటి 2.5 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రతి బ్లాక్‌లో ఒక ఫ్లోటింగ్ ప్లాట్‌ఫారమ్ ,11,200 సోలార్ మాడ్యూల్‌ల శ్రేణి ఉంటుంది. హై డెన్సిటీ పాలిథిలిన్ (HDPE) మెటీరియల్‌తో తయారు చేయబడిన ఫ్లోటర్‌లపై సోలార్ మాడ్యూల్స్ అమర్చబడ్డాయి.
ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకమైనది, ఎందుకంటే అన్ని విద్యుత్ పరికరాలు తేలియాడే ఫెర్రో-సిమెంట్ ప్లాట్‌ఫారమ్‌లపై ఉన్నాయి. డెడ్‌వెయిట్ కాంక్రీట్ బ్లాక్‌లు యాంకర్‌లుగా పనిచేస్తాయి. NTPC 100MW ప్రాజెక్ట్ సంవత్సరానికి 2,000 మిలియన్ లీటర్ల నీటిని ఆదా చేస్తుందని పేర్కొంది. ఇది దాదాపు 10,000 గృహాల వార్షిక నీటి అవసరాలను తీర్చడానికి సరిపోతుంది.
రామగుండం వద్ద ఏడాదికి సుమారు 32.5 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఆవిరైపోకుండా నివారించవచ్చని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. “సోలార్ మాడ్యూల్స్ కింద ఉన్న నీటి బాడీ వాటి పరిసర ఉష్ణోగ్రతను మేయిన్‌టేన్ చేయడంలో సహాయపడుతుంది. తద్వారా వాటి సామర్థ్యాన్ని, ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అదేవిధంగా, సంవత్సరానికి 1,65,000 టన్నుల బొగ్గు వినియోగాన్ని నివారించవచ్చు. సంవత్సరానికి 2,10,000 టన్నుల CO2 ఉద్గారాలను నివారించవచ్చు” అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇలాంటివి ఇంకెక్కడ ఉన్నాయి..?
- NTPC (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఇప్పటికే 222 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులను ప్రారంభించింది, మరో 40 మెగావాట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. నివేదిక ప్రకారం, 2032 నాటికి పునరుత్పాదక వనరుల ద్వారా 60 GW ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
- NTPC కేరళలోని కాయంకుళం (92 మెగావాట్లు), ఆంధ్రప్రదేశ్‌లోని సింహాద్రి (25 మెగావాట్లు) రిజర్వాయర్లపై తేలియాడే సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే 600 మెగావాట్ల సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ 2,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అయితే ఇది ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలోని ఓంకారేశ్వర్ డ్యామ్‌పై నిర్మాణ దశలో ఉంది. జార్ఖండ్‌లోని గెటల్‌సుడ్, ఉత్తరప్రదేశ్‌లోని రిహాండ్ రిజర్వాయర్, మహారాష్ట్రలోని వైతర్ణ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.
- ప్రభుత్వ రంగ విద్యుత్ దిగ్గజం NTPC NSE మార్చిలో తన రామగుండంలోని ప్లాంట్‌లో 42.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఆ తర్వాత రామగుండం ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.
విదేశాల్లో తేలియాడే సోలార్ ప్లాంట్లు
- ది హిందూ ప్రకారం.. మొదటి ఫ్లోటింగ్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ 2007లో జపాన్‌లో ఏర్పాటు చేశారు.
అఆగే US, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ లోనూ ఏర్పాటు చేసినప్పటికీ ఈ ప్టాంట్లు కేవలం పరిశోధన, ప్రదర్శనలకే పరిమితమయ్యాయి. - 2008లో కాలిఫోర్నియాలో పరిమాణంలో చిన్నదైనప్పటికీ మొదటిసారి వాణిజ్యపరంగా సోలర్ విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఆ తర్వాత ఈ సాంకేతికతను అనేక ఇతర దేశాలు త్వరగా స్వీకరించాయి.
- ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ఫామ్ చైనాలోని షాన్‌డాంగ్‌లో ఉంది. ఈ ప్లాంటు గంటకు 320 మెగావాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. నివేదిక ప్రకారం, చైనా తరచుగా వరద ప్రాంతాలలో తేలియాడే సోలార్ ఫామ్‌లను ఏర్పాటు చేస్తుంది.
- 2021లో సింగపూర్ 45 ఫుట్‌బాల్ మైదానాలకు సమానమైన ప్రదేశంలో తేలియాడే సోలార్ ప్యానెల్ ఫారమ్‌ను ఆవిష్కరించింది. దక్షిణ కొరియా అదే విధంగా నార్త్ జియోల్లా ప్రావిన్స్‌లో భారీ ఫ్లోటింగ్ సోలార్ ఫామ్‌ను నిర్మించాలని యోచిస్తోంది. దీని సామర్థ్యం 1,200 మెగావాట్లని అంచనా. ఇది ఆ దేశ విద్యుత్ ఉత్పత్తి మొత్తం సామర్థ్యంలో 0.9 శాతానికి సమానం.
Nice