సింగిల్ చార్జ్‌పై 120కి.మి.
43లీటర్ల బూట్ స్పేస్ దీని ప్రత్యేకం
బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్-అప్ రివర్ (River ) తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ అయిన ఇండీ ఇ-స్కూటర్ (Indie e-scooter) ను ప్రదర్శించింది. ఇది స్కూటర్లలో SUV అని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌లు చేసుకోవచ్చు. ఈ -స్కూటర్ ధర 1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్ బెంగళూరు) కంపెనీ ప్రస్తుతం FAME II సబ్సిడీ కోసం దరఖాస్తు చేసింది.
కంపెనీ ప్రకారం ఈ-స్కూటర్ బెంగుళూరులోని దాని R&D ఫెసిలిటీలో డిజైన్-ఫస్ట్ విధానం ద్వారా రూపొందించబడింది. 55-లీటర్ల అతిపెద్ద స్టోరేజ్ స్థలం (43 లీటర్ బూట్ స్పేస్, 12 లీటర్ గ్లోవ్ బాక్స్) వంటి అనేక ప్రత్యేక లక్షణాలతో Indie e-scooter ను డిజైన్ చేశారు. ఇ-స్కూటర్ 6.7kW గరిష్ట శక్తిని కలిగి ఉంది. ఇది గరిష్టంగా 90kmph వేగంతో దూసుకుపోగలదు. 4kWh బ్యాటరీ సాయంతో ఒక్కసారి చార్జ్ చేస్తే 120km (ఎకో మోడ్‌లో) ప్రయాణించగలదు. అన్ని ఇ-స్కూటర్‌ల మాదిరిగానే ఇది మూడు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉందిజ. అవి ఎకో, రైడ్, రష్. సాధారణ ఛార్జర్‌ని ఉపయోగించి ఇండీని 5 గంటల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.
14-అంగుళాల చక్రాలు
ఇ-స్కూటర్‌లో 14-అంగుళాల చక్రాలు ఉన్నాయి. ఇది భారతదేశంలోని ఇ-స్కూటర్ సెగ్మెంట్‌లో మొదటిదని చెప్పవచ్చు. ఇది అధిక రైడింగ్ పొజిషన్, మెరుగైన రైడ్‌బిలిటీ, వివిధ రకాల రోడ్డు పరిస్థితులపై మోనోయూవరాబిలిటీని అందిస్తుంది.
డిజైన్ పరంగా ఇది సిగ్నేచర్ ట్విన్ బీమ్ హెడ్‌ల్యాంప్‌లు, ఇ-స్కూటర్‌కు ప్రత్యేకమైన రూపాన్ని అందించడానికి ప్రత్యేకమైన టెయిల్ ల్యాంప్ డిజైన్‌ను కలిగి ఉంది. బైక్ మాదిరిగా కనిపించేలా ఉండే క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్ మెరుగైన హ్యాండ్లింగ్ స్టెబిలిటీని అందిస్తుంది. ఇది ఇ-స్కూటర్ ప్యానెల్‌లు పడిపోయినప్పుడు కూడా రక్షిస్తుంది.
వివిధ రకాల రైడర్‌లకు అనుకూలంగా రైడింగ్ పొజిషన్ వివిధ హైట్లు వ్యక్తులకు అనుగుణంగా రూపొందించబడింది. ఇది సెగ్మెంట్‌లో పొడవైన వెడల్పాటి సీటు కలిగి ఉందని కంపెనీ పేర్కొంది, ఇది అధిక సౌకర్యాన్ని అందిస్తుంది. ఇండియాలో స్కూటర్ సెగ్మెంట్‌లో మొదటిది ఇండీ కూడా ఫ్రంట్ ఫుడ్ పెగ్‌ని కలిగి ఉంది. ట్విన్ రియర్ హైడ్రాలిక్ సస్పెన్షన్ మరియు టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ సౌకర్యాన్ని పెంచుతాయి. డెలివరీలు ఆగస్టు 2023లో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.