సింగిల్ చార్జిపై 125 కి.మీ రేంజ్
ఆర్య ఆటోమొబైల్స్ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ Aarya Commander e-Bike ను వచ్చే నెలలో విడుదల చేయనుంది. ఆర్య కమాండర్ ఒక్కో ఛార్జీకి 125 కి.మీల రేంజ్ ఇస్తుంది. దీని ధర (ఎక్స్-షోరూమ్) సుమారు రూ. 1.60 లక్షలు ఉండనుంది. ఈ ఎలక్ట్రిక్‌బైక్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..
గుజరాత్‌కు చెందిన ఆటోమొబైల్ తయారీ సంస్థ ఆర్య ఆటోమొబైల్స్ (Aarya Automobiles ) వచ్చే నెలలో తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసి ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలోకి అడుగుపెట్టనుంది. ఆర్య కమాండర్‌గా పిలువబడే ఈ ఇ-మోటార్‌సైకిల్ ఒక్కసారి ఛార్జింగ్‌పై 125 కిమీలకు ప్రయాణిస్తుంది.
ఆర్య కమాండర్ రేంజ్
ఆర్య కమాండర్ 4.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 125 కిమీల రేంజ్‌ను అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 3 kW (4.02 bhp) ఎలక్ట్రిక్ మోటారుతో అమర్చబడి ఉంటుంది. గంటకు 90 kmph గరిష్ట వేగంతో దూసుకెళ్తుంది. ఇక ఛార్జింగ్ సమయాన్ని పరిశీలిస్తే సాధారణ ఛార్జర్‌తో 5 గంటల్లో ఆర్య కమాండర్ పూర్తిగా చారజ్ అవుతుంది.
హార్డ్‌వేర్, ఫీచర్లు..
ఆర్య కమాండర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున డ్యూయల్ స్ప్రింగ్-లోడెడ్ షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉంటుంది. మోటార్‌సైకిల్లో బ్రేకింగ్ కోసం కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో ఇరువైపులా డిస్క్ బ్రేక్‌లను అమర్చారు. ఇక ఫీచర్ల విషయానికొస్తే, కమాండర్.. బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్ తదితర వాటితో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అమర్చారు.
Aarya Commander e-Bike ధర
ఆర్య కమాండర్ ధర (ఎక్స్-షోరూమ్) దాదాపు రూ. 1.60 లక్షలు (రాష్ట్ర ప్రభుత్వ రాయితీలు మినహాయించి) ఉంటుంది. . దీని కోసం బుకింగ్‌లు రూ. 2,500 రుసుముతో ఇప్పటికే ఓపెన్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఆర్య ఆటోమొబైల్స్ టైర్-1 నగరాల్లో యాక్టివ్ నెట్‌వర్క్‌ని కలిగి ఉందని, త్వరలో ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తుందని కంపెనీ పేర్కొంది. కాగా సూరత్‌లోని ఆర్య ఆటోమొబైల్స్ తయారీ కేంద్రంలో నెలకు 5,000 యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నారు.
2 thoughts on “వచ్చే నెలలో Aarya Commander e-Bike”