సింపుల్ ఎనర్జీ (Simple Energy) రాబోయే త్రైమాసికంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దాని ఫ్లాగ్షిప్ వెహికిల్ అయిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే.. దానికంటే తక్కువ ధరలో ఉండే రెండు కొత్త ఇ-స్కూటర్లను అభివృద్ధి చేయాలని కంపెనీ భావిస్తోంది.
ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న వేరియంట్లను వేగంగా మార్కెట్లోకి తీసుకురావడానికి సింపుల్ ఎనర్జీ కృషి చేస్తోంది. మరిన్ని మోడళ్లతో సింపుల్ ఎనర్జీ పోర్ట్‌ఫోలియో మరింత అందుబాటులోకి వస్తుంది.
Simple Energy సింపుల్ వన్ డెలివరీలు దశలవారీ డెలివరీ ప్లాన్‌లో భాగంగా జూన్ 6న బెంగళూరులో ప్రారంభమయ్యాయి. సింపుల్ వన్ 5kWh ప్యాక్‌తో 212కిమీల రేంజ్ ని అందిస్తుంది, ఇది పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6 గంటల సమయం పడుతుంది.
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం ఉన్న హైస్పీడ్ స్కూటర్లలో ప్రధానమైనది. ఇది కేవలం 2.7 సెకన్లలోనే 0 నుండి 40కిమీ వేగాన్ని అందుకోగలదు. రూ.1.45 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో సింపుల్ వన్ సెగ్మెంట్లోని ఏథర్ 450, ఓలా ఎస్1, హీరో విడా వి1 తోపాటు ఇతర స్కూటర్లకు పోటీ ఇస్తోంది. సింపుల్ వన్ లాంచ్ చేయబోయే ఇతర వేరియంట్లలోని బ్యాటరీ ప్యాక్ తాజా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.
Electric Vehicles అప్డేట్ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,
టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి
[…] సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు & CEO సుహాస్ […]