Harithamithra Telugu News

Home EV Updates చవకైన వడ్డీ రేటుతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు

చవకైన వడ్డీ రేటుతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు

0
Ola Electric Experience Centre

జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల కాలవ్యవధితో  ఆఫర్

బెంగళూరు: భారతదేశపు అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, 2W సెగ్మెంట్‌లో S1 స్కూటర్ పై ఫైనాన్సింగ్ ఆఫర్లను అందిస్తోంది. IDFC ఫస్ట్ బ్యాంక్, L&T ఫైనాన్షియల్ సర్వీసెస్‌ సహా ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థల భాగస్వామ్యంతో జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల కాలవ్యవధికి కేవలం 6.99% వడ్డీ రేటుతో ఓలా స్కూటర్ ని ఇంటికి తీసుకువెళ్లవచ్చు. కస్టమర్లు ఇప్పుడు అతి తక్కువ నెలవారీ EMIలతో, జీరో డౌన్ పేమెంట్‌తో ఓలా స్కూటర్‌ కి యజమాని అవ్వవచ్చు.

ఓలా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకుష్ అగర్వాల్ మాట్లాడుతూ: “మార్కెట్ లీడర్‌గా, మేము ప్రముఖ ఫైనాన్సింగ్ భాగస్వాములతో  ఒప్పదందాలను ఏర్పరచుకున్నాము. టైర్ 1 లోనే కాకుండా టైర్ 2, 3 నగరాల్లో కూడా అత్యంత లాభదాయకమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లను అందిస్తున్నాము. భారతదేశం EV 2W స్వీకరణకు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. మా ఫైనాన్సింగ్ ఆఫర్‌లు పరిశ్రమలో కొత్త విప్లవానికి నాంది పలికాయి. ఈ ఫైనాన్సింగ్ సౌకర్యాలతో EVని సొంతం చేసుకునేందుకు అయ్యే ఖర్చు ఇప్పుడు ఏదైనా ICE వాహనాన్ని కొనడానికి అయ్యేఖర్చుతో పోలిస్తే సగమే ఉంటుంది.” అని అన్నారు.

ఓలా యాప్ ద్వారా వాహనాన్ని కొనుగోలు చేసే ముందు ఫైనాన్సింగ్ ఆప్షన్‌లపై  పూర్తి వివరాల కోసం  కోసం కస్టమర్‌లు తమ సమీప ఎక్స్పీరియన్స్ సెంటర్ వెళ్ళవచ్చు. ఈ ఫైనాన్సింగ్ ఆప్షన్స్ ను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా ఎంచుకోవచ్చు. ఓలా ప్రస్తుతం 700+ ఎక్స్ పీరియన్స్ కేంద్రాలతో భారతదేశపు అతిపెద్ద D2C ఆటోమొబైల్ రిటైల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఆగస్టులో 1000వ ECని ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది.

ఓలా S1 Pro, S1, S1 Air లతో కూడిన S1 లైనప్ అత్యాధునిక సాంకేతికత, అసమానమైన పనితీరుతో కూడిన మినిమలిస్ట్ డిజైన్‌ను కలిగి ఉంది. కంపెనీ ఇప్పుడు వరుసగా మూడు త్రైమాసికాలుగా 2W EV విభాగంలో అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది.

 

Previous articleVolvo C40 Recharge SUV వస్తోంది..
Next articleSimple Energy నుంచి మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here