Home » భారతదేశంలో అతిపెద్ద గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్
Ola Gigafactory

భారతదేశంలో అతిపెద్ద గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్

Spread the love

బెంగుళూరు : భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) బుధవారం దేశంలోనే అతిపెద్ద గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. తమిళనాడులోని కృష్ణగిరిలో కంపెనీ తన సెల్ ఫ్యాక్టరీకి సంబంధించి మొదటి పిల్లర్‌ను భిగించి పనులను మొదలు పెట్టింది. Ola Gigafactory అత్యంత వేగవంతగా నిర్మించిన సెల్ ఫ్యాక్టరీలలో ఒకటిగా నిలవనుంది. తయారీ రంగం లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, అలాగే  EV విప్లవంలొ భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి ఈ ఫ్యాక్టరీ దోహదపడుతుందని కంపెనీ ప్రకటించింది. .

సుమారు 115 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఓలా గిగాఫ్యాక్టరీ వచ్చే ఏడాది ప్రారంభంలో 5 GWh ప్రారంభ సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇది దశలవారీగా 100 GWhకి విస్తరించబడుతుంది. కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఓలా గిగాఫ్యాక్టరీ భారతదేశంలోనే అతిపెద్ద సెల్ ఫ్యాక్టరీ అవుతుంది. పూర్తి సామర్ధ్యానికి విస్తరించినప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద సెల్ తయారీ సౌకర్యాలలో ఒకటిగా నిలుస్తుంది.

ఓలా వ్యవస్థాపకుడు, CEO భావిష్ అగర్వాల్ మాట్లాడుతూ “ఈ రోజు మేము మా Ola Gigafactory మొదటి పిల్లర్‌ను ఇన్‌స్టాల్ చేయడం గర్వంగా ఉంది. భారతదేశ విద్యుదీకరణ ప్రయాణంలో మా గిగాఫ్యాక్టరీ ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తుంది. భారతదేశాన్ని గ్లోబల్ EV హబ్‌గా మార్చడానికి మరింత దగ్గర చేస్తుంది. ఇన్నోవేషన్, టెక్నాలజీ, భారీ మ్యానుఫ్యాక్చరింగ్ పై దృష్టితో ముందుకు సాగుతున్నాం’’ అని తెలిపారు.

ఓలా సెల్ & బ్యాటరీ R&D పై భారీగా పెట్టుబడి పెట్టింది. బెంగుళూరులో ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన సెల్ R&D సౌకర్యాలలో ఒకదాన్ని ఏర్పాటు చేసింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఓలా యొక్క బ్యాటరీ ఇన్నోవేషన్ సెంటర్ కోర్ సెల్ టెక్ డెవలప్‌మెంట్, బ్యాటరీ ఆవిష్కరణలకు మూలస్తంభంగా వ్యవహరిస్తోంది.

కంపెనీ తన తయారీ సామర్థ్యాలను 2Ws, 4Ws, సెల్‌లలో విస్తరించడానికి తమిళనాడు ప్రభుత్వంతో ఇటీవల ఒక MoU సంతకం చేసింది. ఎమ్ఒయులో భాగంగా, ఓలా ఒక EV హబ్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇది అధునాతన సెల్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సౌకర్యాలు, విక్రేత, సరఫరాదారుల పార్కులు, EVల కోసం అతిపెద్ద సహాయక పర్యావరణ వ్యవస్థను ఒకే ప్రదేశంలో ఉంచుతుంది.


Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

One thought on “భారతదేశంలో అతిపెద్ద గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..
Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..