Friday, November 22Lend a hand to save the Planet
Shadow

బజాజ్‌ నుంచి తక్కువ ధరలో సీఎన్ జీ బైక్‌, ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

Spread the love

బజాజ్‌ నుంచి తక్కువ ధరలో సీఎన్ జీ బైక్‌, ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

భారత మార్కెట్లో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను తీసుకువస్తోంది. బజాజ్‌ పల్సర్.. పల్సర్‌ సిరీస్ బైక్స్‌ విక్రయాల ద్వారా యువతలో మంచి యమ క్రేజ్ సొంతం చేసుకుంది. ఇదే ఊపును కొనసాగిస్తూ.. రానున్న రోజుల్లో బజాజ్‌ మరిన్ని టూ వీలర్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త స్కూటర్లు, బైక్ లు మరింత హై టెక్నాలజీతో రానున్నాయి.

బజాజ్ సీఎన్ జీ బైక్

బజాజ్‌ కంపెనీ నుంచి కూడా సీఎన్ జీ బైక్‌ వస్తోంది. తక్కువ ధరలోనే సీఎన్ జీతో నడిచే ఈ బైక్ ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి E101 అనే కోడ్ పేరును బజాజ్ సంస్థ ప్రకటించింది. కాగా రానున్న కొత్త CNG బైక్ CT100 లేదా CT110 మోడల్ పై ఆధారపడి ఉండనుంది. కాగా ఈ బైక్ సరసమైన ధరలో అందుబాటులోకి రానుంది. భారత మార్కెట్ లో బజాజ్ పల్సర్ N150 విడుదలైన తర్వాత, పల్సర్ P150 విక్రయాలు నిలిపివేశారు. కాగా ఇప్పుడు సంస్థ P సిరీస్ లో 125 సీసీ కేటగిరీలో కొత్త బైక్ Pulsar P 125 ను విడుదల చేయడానికి బజాజ్‌ సిద్దమవుతోంది. అయితే ఇప్పటికే ఈ సరికొత్త బైక్‌ ట్రయల్‌ రన్‌ రోడ్లపై చక్కర్లు కొట్టగా వేయగా.. ఈ బైక్‌ దాదాపు పల్సర్ P150 బైక్ ను పోలి ఉంటుంది.

బజాజ్ నుంచి సన్నీ EV

బజాజ్ నుంచి సన్నీ EVని కూడా కంపెనీ తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్కూటర్‌ ఈవీ మార్కెట్ లో అత్యుత్తమ స్కూటర్ గా నిలిచే అవకాశాలున్నాయని సంస్థ భావిస్తోంది. కాగా దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ స్కూటర్ ను వినూత్నమైన ఆకర్షణీయమైన ఫీచర్ల, కట్టిపడేసే డిజైన్ తో అధునాతనంగా తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది భారత మార్కెట్లో ఈ స్కూటర్ ను బజాజ్‌ గ్రాండ్ గా ప్రారంభించనుంది.

కొత్త బజాజ్ సిటీ (CT)

భారత్ లో మధ్య తరగతి ప్రజల జనాభా ఎక్కువ. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని బజాజ్ సిటీ (CT) సిరీస్ లో కొత్త బైక్ ను అభివృద్ధి చేస్తోంది. ఈ బైక్‌ పేరు బజాజ్‌ CT 150X కాగా దీనిని టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా ఇటీవల గుర్తించారు. ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లతో ఈ బైక్‌ అందుబాటులోకి రానుంది. కాగా ఈ వాహనం.. పల్సర్ 150సీసీ బైక్ లో ఉన్న ఇంజన్ కలిగి ఉండవచ్చని సమాచారం. ఇక బజాజ్‌ నుంచి తక్కువ ధరలో మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కూడా రానుంది. ఇంకా అభివృద్ధి దశలో ఉన్న చేతక్ (Chetak) ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొత్త వేరియంట్ ను ఇటీవల రోడ్ పై టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా కెమెరాకు చిక్కింది. కాగా ఈ చిత్రాలు ఇంటర్నెట్ లో వైరల్‌ అవుతున్నాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్ ధర దాదాపు రూ. లక్ష వరకు ఉంటుందని సమాచారం.

బజాజ్ పల్సర్ (Bajaj Pulsar) NS400.. ఈ వాహనం దాదాపు పల్సర్ NS200 మాదిరిగానే డిజైన్, ఫీచర్లను పోలి ఉంటుంది. 373 సీసీ లిక్విడ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇంకా గరిష్ఠంగా 40 bhp శక్తి, 35 nm గరిష్ట టార్క్ ను జనరేట్ చేస్తుంది.

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు… కృతజ్ఞతలు..

Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *