Home » ఒక్కసారి చార్జితో 170కి.మీ ప్రయాణించవచ్చు..  ప్యూర్ ఈవీ నుంచి ecoDryft 350  Electric bike విడుదల..

ఒక్కసారి చార్జితో 170కి.మీ ప్రయాణించవచ్చు..  ప్యూర్ ఈవీ నుంచి ecoDryft 350  Electric bike విడుదల..

ecoDryft 350 Electric Motorcycle
Spread the love

Pure EV ఈరోజు తన కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వేరియంట్, ecoDryft 350ని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) రూ. 1.30 లక్షలుగా ఉంది. ఆసక్తిగల కస్టమర్‌లు దేశవ్యాప్తంగా ఉన్న ప్యూర్ EV అధీకృత డీలర్‌షిప్‌లలో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను బుక్ చేసుకోవచ్చు. 171 కిమీ ఛార్జ్‌తో, ప్యూర్ ఎకోడ్రైఫ్ట్ 350 110 సిసి కమ్యూటర్ సెగ్మెంట్‌లో అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అని కంపెనీ తెలిపింది.

బ్యాటరీ.. రేంజ్

Pure EV ecoDryft 350 ఎలక్ర్టిక్ బైక్ లో 3.5 kWh Li-ion బ్యాటరీతో 3kW ఇ-మోటార్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది 40Nm వరకు టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఎలక్ట్రిక్ బైక్ గరిష్ట వేగం గంటకు 75 కిమీకి పరిమితం చేశారు. ప్యూర్ EV ecoDryft 350 ఒక్కసారి ఛార్జ్‌పై సుమారు 171 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. బైక్ ఛార్జింగ్ సామర్థ్యం గురించి ఎటువంటి సమాచారం లేదు. అయితే, రివర్స్ మోడ్‌తో పాటు మూడు రైడ్ మోడ్‌లు ఇందులో ఉన్నాయి.

ecoDryft 350 ఫీచర్లు

Pure Ev Electric bike ecoDryft 350 బైక్ ఫీచర్ల గురించి చెప్పాలంటే, కోస్టింగ్ రీజెన్, హిల్-స్టార్ట్ అసిస్ట్, డౌన్‌హిల్ అసిస్ట్ ,పార్కింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లను ఇందులో పొందుపరిచారు.

Pure Ev Electric bike ధర

ecoDryft రూ.1.30 లక్షల ఎక్స్ షోరూం ధరతో ప్రారంభించారు. ఇది నెలకు రూ. 4,000 నుంచి సులభమైన EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది, ఆసక్తిగల కస్టమర్లు దేశంలోని 100కి పైగా ప్రత్యేక ప్యూర్ డీలర్‌షిప్‌ల నుంచి ఈ కొత్త ఇ-మోటార్‌సైకిల్‌ను పొందవచ్చు. ప్యూర్ EV ecoDryft 350 కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కస్టమర్‌లు టెస్ట్ డ్రైవ్‌లను కూడా చేసుకోవచ్చు.

ఈ బైక్ లాంచ్ గురించి ప్యూర్ EV సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ వదేరా మాట్లాడుతూ.. మా నమ్మకమైన వినియోగదారుల కోసం విలువైన ఉత్పత్తులను అందించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ecoDryft 350 అనేది.. 110 CC సెగ్మెంట్‌లో విశ్వసనీయమైన, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా నిలుస్యాుంని తెలిపారు. సమీప భవిష్యత్తులో భారతదేశం ప్రయాణించే విధానాన్ని మార్చగలదని మేము విశ్వసిస్తున్నామని చెప్పారు.

ఈ పెట్రోల్ బైక్ లకు పోటీ ఇవ్వొచ్చు..

హీరో స్పెండర్, హెూండా పైన్, బజాజ్ ప్లాటినా వంటి ఎంట్రీ-లెవల్ ICE కమ్యూటర్ మోటార్ సైకిళ్లను ప్యూర్ EV లక్ష్యంగా చేసుకుంది. ఇంకా, ఇది భారతీయ మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ లలో హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కు ప్రత్యర్థిగా నిలుస్తుంది.
ecoDryft 350 నెలకు రూ.4,000 నుంచి సులభమైన EMI ఎంపికలతో -అందుబాటులో ఉంది. HeroFincorp, L&T ఫైనాన్షియల్ సర్వీసెస్, ICICI మొదలైన వాటితో ఫైనాన్సింగ్ ఆప్షన్లను అందిస్తూ, 100కి పైగా ప్రత్యేకమైన ప్యూర్ డీలర్షిప్లో కొనుగోలు చేయడానికి ఇది అందుబాటులోఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *