
bajaj Auto| దూసుకుపోతున్న చేతక్.. ఈవీ మార్కెట్ లో టాప్ ఇదే..
Bajaj Auto | భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో బజాజ్ ఆటో దూసుకుపోతోంది. బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్ (bajaj chetak) డిసెంబర్ 1-14 మధ్య 9,513 యూనిట్ల రిటైల్ అమ్మకాలతో భారతదేశ ఎలక్ట్రిక్-టూ-వీలర్ మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతోంది. దీని తర్వాత స్థానంలో TVS iQube (7,567 యూనిట్లు), Ola Electric (6,387 యూనిట్లు), Ather Energy (5,053 యూనిట్లు) ఉన్నాయి. ఇది డిసెంబర్ చివరి రెండు వారాల్లో ఈ ట్రెండ్ కొనసాగుతోంది. జనవరి 2020లో ప్రారంభించినప్పటి నుండి చేతక్ స్కూటర్ అత్యధికంగా అమ్ముడైన EV కావడం ఇదే మొదటిసారి.ఏడాది చివరి నెల మొదటి పక్షం రోజులు పూర్తయ్యాయి. డిసెంబర్ 1-14, 2024 మధ్య 34,770 యూనిట్ల ఎలక్ట్రిక్ టూ-వీలర్ (Electric Scooter) రిటైల్ అమ్మకాలు నమోదయ్యాయి. పండుగ సమయాల్లో అక్టోబర్, నవంబర్‌ల ఏకంగా 119,314 యూనిట్లలో 139,973 యూనిట్లు అమ్ముడయ్యాయి. కొత్తగా వాహనాలను కొనుగోలు చేసేవారు సాధారణంగా...