e-sprinto electric scooters : భారత ఆటోమొబైల్ మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేశాయి. పెట్రోల్ వాహనాలను ప్రత్యామ్నాయంగా వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గుచూపుతుండడంతో ఈవీలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు సరికొత్త వాహనాలను ప్రవేశపెడుతున్నాయి.
తాజా ఇ-స్ప్రింటో (e-sprinto) కంపెనీ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న Rapo, Roamy పేర్లతో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసింది.
ఇందులో మొత్తం 6 మోడళ్లను కలిగి ఉంది.
e-sprinto Roamy రోమీ ఇ-స్కూటర్ ప్రారంభ ధర రూ.54,999 (ఎక్స్‌షోరూం), Rapo రాపో ప్రారంభ ధర రూ.62,999 (ఎక్స్‌షోరూం)గా ఉంది. కాలేజీ విద్యార్థులు, పట్టణ ప్రజలు, కార్మికులు, మహిళలు సహా అన్ని వర్గాలకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ స్కూటర్లను అందుబాటులోకి తెచ్చినట్లు ఇ-స్ప్రింటో సంస్థ పేర్కొంది.
ఇ-స్ర్పింటో రాపో స్పెసిఫికేషన్లు
e-sprinto Rapo స్కూటర్ పొడవు 1840 mm, 720 mm వెడల్పు, 1150 mm ఎత్తు ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 170
mm ఉంది. పోర్టబుల్ ఆటోకటాఫ్ ఛార్జర్‌తో కూడిన లిథియం/ లీడ్ బ్యాటరీ, IP65 వాటర్‌ఫ్రూఫ్ రేటింగ్‌తో 250 W BLDC హబ్ మోటార్‌కు
శక్తిని ఇస్తుంది.
Rapo ఇ-స్కూటర్ గరిష్ఠంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 100 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఈ స్కూటర్
ముందు భాగంలో టెలిస్కోపిక్ హైడ్రాలిక్ సస్పెన్షన్, వెనుక భాగంలో కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంది. 12 అంగుళాల ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 10
అంగుళాలతో వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. 150 కిలోల లోడింగ్ సామర్థ్యం వస్తుందని ఇ-స్ర్పింటో సంస్థ తెలిపింది.
రోమీ స్పెసిఫికేషన్లు
e-sprinto Roamy స్కూటర్ పొడవు 1800 mm, 710 mm, ఎత్తు 1120mm, గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. పోర్టబుల్ ఆటో కట్ ఆర్ ఛార్జర్‌తో లిథియం/లీడ్ బ్యాటరీని కలిగి ఉంది. 250 W BLDC హబ్ మోటార్, IP65 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది..
Roamy Electric Scooter గరిష్ఠంగా 25 kmph వేగంతో ప్రయాణిస్తుంది. ఇక రేంజ్ విషయానికొస్తే ఇది సింగిల్
ఛార్జింగ్‌లో 100 కి.మీ మైలేజీ ఇస్తుంది.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అధునాతన టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫ్రంట్ సస్పెన్షన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ తో కూడిన
కాయిల్ స్ర్పింగ్ సహా 3 స్టెప్ అడ్జెస్టబుల్ సస్పెన్షన్ ఉన్నాయి. 150 కిలోల లోడింగ్ సామర్థ్యంతో వస్తుంది.
ఫీచర్‌లు ఏమున్నాయి..?
ఈ రెండు స్కూటర్లలో రిమోట్ లాక్/ అన్‌లాక్, రిమోట్ స్టార్ట్.. ఇంజిన్ కిల్ స్విచ్/ చైల్డ్ లాక్ / పార్కింగ్ మోడ్ తోపాటు USB మొబైల్
ఛార్జింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. డిజిటల్ డిస్‌ప్లేలో బ్యాటరీ స్థితి, మోటార్ వైఫల్యం తోపాటు కంట్రోల్ వైఫల్యం, థొరెటల్ వైఫల్యం
వంటి వివరాలను తెలుపుతుంది.
రాపో ఇ- స్కూటర్ బ్లూ, రెడ్, గ్రే, బ్లాక్ అండ్ వైట్ రంగులలో లభిస్తుంది. రోమీ ఇ-స్కూటర్ బ్లూ, రెడ్, నలుపు, వైట్, బూడిద రంగులలో అందుబాటులో ఉంటుంది. అత్యంత చౌక ధరలకే e-sprinto electric scooters వస్తుండడంతో కస్టమర్ల నుంచి భారీ స్పందన వస్తుందని సంస్థ అంచనాలు పెట్టుకుంది.
ఇ-స్ర్పింటో స్కూటర్ సహా వ్యవస్థాపకుడు డైరెక్టర్ అతుల్ గుప్తా మాట్లాడుతూ.. స్కూటర్ల విడుదలపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ రెండు ఈవీలు భద్రతను ఇస్తాయని హామీ ఇచ్చారు. తాము వినూత్న ఉత్పత్తులను పరిచయం చేసేందుకు, మరింత వైవిధ్యపరిచేందుకు చురుగ్గా అన్వేషిస్తున్నామని చెప్పారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు… కృతజ్ఞతలు..
Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
I want this vehicle 54000 electric vechile i will exchange my vechile
I want this vehicle